Breaking News

27/03/2019

అత్యధిక మేజారిటీ ఇవ్వండి

సిద్దిపేట, మార్చి 27, (way2newstv.in
పేదల గుండెల్లో నిలిచిన పార్టీ టి ఆర్ ఎస్.  రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపి రైతు బందువుగా నిలిచిన నాయకుడు కేసీఆర్.  సిద్దిపేట లక్ష్యం. లక్ష మెజారిటని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండల కేంద్రంలో జరిగిన ప్రచార సభలో అయన మాట్లాడారు.  కారుకు ఓటేస్తే కాళేశ్వరం నీళ్లు.  కాళేశ్వరం కాలువలతో మీ కాళ్లు కడుగుతాం.  దేశంలో  542 ఎంపీ స్తానాల్లో అత్యధిక  మెజారిటీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలువ బోతున్నారు.   దేశంలోనే  ప్రభాకర్ రెడ్డికి రికార్డు మెజారిటీ అందించడం ద్వారా సీఎం  కేసీఆర్  గౌరవాన్ని, సిద్దిపేట గౌరవాన్ని మరోసారి చాటాలని కోరారు.  ఎమ్మెల్యేగా రాష్ట్రంలో రికార్డు మెజారిటీతో గెలిపించారు.. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను.   సీఎం అభివృద్ధిని చూసి అన్ని నియోజకవర్గాల్లో లక్ష మెజార్టీ ఇస్తామని ఎమ్మెల్యేలంతా పోటీపడుతున్నారు.  ఎంపీ , ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా సరిగ్గా ఉంటేనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు సమృద్ధిగా అందుతాయని అన్నారు.  


అత్యధిక మేజారిటీ ఇవ్వండి
 
సిద్దిపేటకు పాస్ పోర్టు కేంద్రం తెచ్చినా, ఈ ప్రాంతానికి జాతీయ రహదారి మంజూరు చేయించినా ఆ ఘనత ప్రభాకర్ రెడ్డిదే.  మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో తెరాస  పార్టీ బలీయమైన శక్తిగా ఉంది.   ఎమ్మెల్యే, సర్పంచు ఎన్నికల్లో ఎలాగైతే కష్టపడ్డారో అలాగే వచ్చే 15 రోజుల్లో కష్టపడి రికార్డు మెజారిటీ అందించాలి.    కాళేశ్వరం కాలువ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో 30 వేల  ఎకరాలకు నంగునూరు మండలంలో అందించబోతున్నామని అయన అన్నారు.    కాంగ్రెస్, బిజెపి నాయకులు ఓట్లు వున్నప్పుడు వస్తారు.  తరువాత కనిపించకుండా పోతారు. కానీ తెరాస నాయకులు ఎల్లప్పుడూ ప్రజలల్లో వారి కష్టసుఖాల్లో ఉంటారు.  16 ఎంపీ స్థానాలు సాధించి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలో మనం డిసైడ్ చేసే పరిస్థితి ఉంటే ఢిల్లీ నుండి నిధులు వాటంతట అవే వస్తాయి.  జాతీయ పార్టీలకు ఓటేస్తే జాడ లేకుండా పోతారు. కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు ఓట్లప్పుడే కనపడుతారు... ఓట్లు అయిపోతే జాడ లేకుండా పోతారని అన్నారు. - నన్ను గుండెల్లో పెట్టుకొని లక్ష మెజార్టీ ఇచ్చారు. మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంట. మీ అభిమానంవెల కట్టలేనేది. మీ రుణం తీర్చుకోలేనిది.  నాకు మీరు అభివృద్ధిలో... ఎన్నికల్లో ..ప్రతి పనిలో తోడుగా అండగా ఉన్నారు. మీకు మేము ఇద్దరం తోడైతామని అన్నారు.  నాకు ఎంత మెజార్టీ ఇచ్చారో ప్రభాకర్ అన్నకు అంతే మెజార్టీ ఇవ్వాలి.. మన గౌరవాన్ని పెంచాలి.  రేపు మనకు రైలు రాబోతోంది అంటే ప్రభాకర్ అన్న కృషి ఎంతో ఉంది.. మన నంగునూర్ మండలం పక్కన నుండే మెదక్ , ఎల్కాతుర్తి వరకు జాతీయ రహదారి కాబోతోందని అన్నారు. ...

No comments:

Post a Comment