తల్లి పాలు త్రాగి రొమ్ము గుద్దే రకం కెసిఆర్ ది: విజయశాంతి
మెదక్ మార్చి27 (way2newstv.in)
నాడు తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ వద్దకు కుటుంబసమేతంగా వెళ్లి కాళ్లు మొక్కావు. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలని కంకణం కట్టుకున్నావు. తల్లి పలు త్రాగి రొమ్ము గుద్దే రకం నీవు, నీకెమైనా దిమాక్ ఉందా అని అడుగుతున్నా. కాంగ్రెస్ ను లేకుండా చేయడం నీ వల్ల కాదు కదా.. నీ తాత వల్ల కూడా కాదు. అసలు కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వకపోయి ఉంటే నువ్వు సీఎం అయ్యేవాడివా అని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ను అంతం చేయడం నీవల్ల కాదు
మెదక్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మెదక్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ నామినేషన్‌కు హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడారు. 2009 ఎన్నికల్లో సిరిసిల్లలో తాను ప్రచారం చేయకుంటే కేసీఆర్ కొడుకు గెలిచేవాడా. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యేవాడా అని ప్రశ్నించారు. ప్రతి ఎన్నికలప్పుడు ఏదో కొత్త రాగం తీయడం కేసీఆర్‌కు రోగంలా మారిందని విమర్శించారు.80 లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ నాయకులకే దక్కని ప్రధాని పదవిని..16 సీట్లతో కేసీఆర్ ఎలా తెచ్చుకుంటారో చెప్పాలన్నారు.
No comments:
Post a Comment