Breaking News

09/03/2019

'సర్వం తాళమయం' చిత్రానికి వస్తున్న ఆదరణ దర్శకుడిగా నాకెంతో సంతృప్తినిస్తోంది - రాజీవ్‌ మీనన్‌

జి.వి.ప్రకాష్‌ హీరోగా మైండ్‌ స్క్రీన్‌ సినిమాస్‌ పతాకంపై రాజీవ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందిన సంగీత ప్రధాన చిత్రం 'సర్వం తాళమయం'. ఇటీవల విడుదలైన ఈ సినిమా అందరి ఆదరాభిమానాలతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.  ఈ సందర్భంగా దర్శకుడు రాజీవ్‌ మీనన్‌ మాట్లాడుతూ ''శంకరాభరణం, సాగర సంగమం వంటి సంగీత భరిత చిత్రాలను రూపొందించి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న మహా దర్శకులు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారు 'సర్వం తాళమయం' చిత్రాన్ని చూసి అభినందించడం, ఆశీర్వదించడం పెద్ద అవార్డుగా భావించాను. 


 'సర్వం తాళమయం' చిత్రానికి వస్తున్న ఆదరణ దర్శకుడిగా నాకెంతో సంతృప్తినిస్తోంది - రాజీవ్‌ మీనన్‌

అలాగే ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి ప్రశంసిస్తున్నారు. రెహమాన్‌ మ్యూజిక్‌ ఈ చిత్రానికి జీవం పోసింది. ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ దర్శకుడిగా నాకెంతో సంతృప్తినిస్తోంది. ఈ విజయానికి కారకులైన అందరికీ కృతజ్ఞతలు'' అన్నారు.  హీరో జి.వి.ప్రకాష్‌ మాట్లాడుతూ ''హీరోగా నాకు మంచి పేరు తెచ్చిన సినిమా ఇది. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా నన్ను అందరూ నన్ను అప్రిషియేట్‌ చేస్తున్నారు. చాలా బాగా చేశావు అని మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను. మా మావయ్య సంగీతం చెయ్యడం, నేను హీరోగా నటించడం నా జీవితంలో ఓ మెమరబుల్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన రాజీవ్‌ మీనన్‌గారికి థాంక్స్‌'' అన్నారు.

No comments:

Post a Comment