Breaking News

01/03/2019

రా కు అభినందన్

న్యూఢిల్లీ, మార్చి 1 (way2newstv.in)
భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్థాన్ భారత్‌కు అప్పగించనుంది. అతని కోసం వాఘా సరిహద్దు దగ్గర భారీ ఎత్తున అధికారులు, ప్రజలు వేచి చూస్తున్నారు. అయితే అతడు భారత్‌లో అడుగు పెట్టగానే చాలా పెద్ద ప్రక్రియనే పూర్తి చేయాల్సి ఉంటుంది. మళ్లీ అతడు సాధారణ జీవితం గడపటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. యుద్ధ ఖైదీ తిరిగి స్వదేశానికి వస్తున్నపుడు అనుసరించే ప్రక్రియను ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. 


 రా కు అభినందన్ 

1. అభినందన్ ఇండియాలో అడుగుపెట్టగానే అతన్ని నేరుగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు తీసుకెళ్తారు.
2. అతని ఫిట్‌నెస్ స్థాయి తెలుసుకోవడానికి కొన్ని వైద్య పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది
3. పాకిస్థాన్ ఆర్మీ అతని శరీరంలో ఏమైనా ఉంచిందా అన్నది తెలుసుకోవడానికి వివిధ స్కాన్‌లు నిర్వహిస్తారు
4. ఇక అభినందన్‌కు మానసిక పరీక్షలు కూడా నిర్వహిస్తారు. శత్రువుల చెరలో అతను ఉండటం, కొన్ని రోజుల పాటు షాక్‌లో గడపడం వల్ల శత్రు దేశం మన రహస్యాలను తెలుసుకోవడానికి అతన్ని హింసించిందా అన్నది ఈ పరీక్షల ద్వారా చూస్తారు.
5. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) కూడా అతన్ని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. 
వాస్తవానికి ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ తమ వ్యక్తిని విచారించడానికి ఐబీ లేదా రాను అనుమతించదు కానీ.. ఇది అరుదైన కేసు కాబట్టి తప్పకపోవచ్చు అని సదరు అధికారి వెల్లడించారు. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా తన మిషన్ గురించి సమాచారం శ‌త్రువుల‌కు ఇచ్చాడా లేదా అన్నది అభినందన్ నుంచి రాబడతారు. ఐఏఎఫ్ ఇంటెలిజెన్స్ ఈ పని చేస్తుంది. అతను పాకిస్థాన్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుసు కాబట్టి.. ఓ ప్రామాణిక ప్రక్రియను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని ఆ అధికారి స్పష్టం చేశారు. ఒకవేళ అభినందన్ తన శారీరక, మానసిక ఫిట్‌నెస్‌ను నిరూపించకపోతే.. భవిష్యత్తులో అతడు ఆఫీస్ పనికే పరిమితం కావాల్సి ఉంటుందని ఆ అధికారి చెప్పడం విశేషం.  

No comments:

Post a Comment