Breaking News

07/03/2019

ఉత్తరాంధ్రలో గెలుపు గుర్రాల కోసం టీడీపీ అన్వేషణ

విశాఖపట్టణం, మార్చి 7, (way2newstv.in)
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మొత్తం శాసనసభ, లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ ప్రణాళిక రూపొందిస్తోంది. దీనిలో భాగంగా లోక్‌సభ, శాసనసభ కు పోటీచేసే అభ్యర్థుల కోసం గెలుపు గుర్రాలను అన్వేషిస్తోంది. ఉత్తరాంధ్రలో గల ఐదు లోక్‌సభ స్థానాల్లో ఆర్ధికంగా రాజకీయంగా సామాజికంగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి మొత్త్తం 33 శాసన సభ స్థానాలను కైవసం చేసుకోవటానికి సన్నాహాలను ప్రారంభించింది. దీనిలో భాగంగా విశాఖపట్నం లోక్‌సభ స్థానాన్ని వెనుకబడిన సామాజిక వర్గానికి కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది.ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన నాయుడు,విజయనగరం నుంచి పూసపాటి అశోక గజపతి రాజు, విశాఖపట్నం నుంచి కంభంపాటి హరిబాబు, అనకాపల్లి నుంచి అవంతి శ్రీనివాసరావు, అరకు నుంచి కొత్తపల్లి గీత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 


ఉత్తరాంధ్రలో గెలుపు గుర్రాల కోసం టీడీపీ అన్వేషణ

వీరిలో హరిబాబు గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచిన సంగతి తెలిసిందే.కొత్తపల్లి గీత  వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొంది తరువాత పరిణామాలతో కోద్దిరోజులు తెలుగుదేశం పార్టీతో కలిసినా ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అనకాపల్లి నుంచి గెలిచిన అవంతి శ్రీనివాసరావు కొద్దిరోజులు కిందట  వైఎస్సార్‌సీపీలో చేరారు. ఉత్తరాంధ్రలో  ముగ్గురు  అభ్యర్థులను కొత్తగా ఎంపిక చేయాల్సిన పరిస్థితి  టీడీపీకి తలెత్తింది. శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు. విజయనగరం నుంచి అశోక గజపతిరాజు పార్టీ అభ్యర్థులగా పోటీచేయటం దాదాపు ఖాయం. విశాఖపట్నం నుంచి దశాబ్దకాలంగా అగ్రవర్ణాలకు చెందినవారే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ లోక్‌సభ స్థానాన్ని వెనుకబడిన వర్గాలకు చెందినవారికి కేటాయించాలని చిరకాలంగా డిమాండ్ ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో యాదవ, కొప్పల వెలమ, తూర్పు కాపు, గవర సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. 1998వ సంవత్సరంలో ఈ సీటును బీసీలకు కేటాయించాలని అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చింది.వివిధ సమీకరణాల వలన అప్పట్లో అగ్రవర్ణాలకే ఈ సీటును కేటాయిస్తూ అధిష్టానం వచ్చింది. ప్రస్తుత పరిస్థితులలో వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన యాదవ మత్సకారుల నుంచి ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి  చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీనితో పాటు అగ్రవర్ణాల నుచి సరియైన అభ్యర్థి  కూడా లేకపోవటం, ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కొనగల వారిని ఎంపిక చేయకపోతే దీని ప్రభావం శాసనసభ స్థానాలపై పడుతుందని ముఖ్యమంత్రి బేరీజు వేస్తున్నట్లు తెలిసింది.

No comments:

Post a Comment