విజయవాడ, మార్చి 7, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య డేటా యుద్ధం మరింత రాజుకుంటోంది. తెలంగాణ పోలీసులపై కేసులు నమోదు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ గ్రిడ్‌లోని తమ పార్టీ సమాచారాన్ని వైసీపీకి ఇచ్చారని టీడీపీ ఆరోపించింది. తెలంగాణ పోలీసులు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీరుపై టీడీపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీనిపై గుంటూరు పోలీసులకు పిర్యాదు చేయాలని నిర్ణయించింది. సజ్జనార్ తీరును ఇప్పటికే చంద్రబాబు సహా ఏపీ మంత్రులందరూ తప్పుపట్టారు. తమ డేటాను చోరీ చేశారని నిర్ధారణ కావడంతో సాక్ష్యాలతో సహా పిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించి, అవసరమైతే కోర్టు వెళ్లాలని నిర్ణయించింది.తమ డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసిందని ఏపీ అంటుంటే.. గోప్యంగా ఉంచాల్సిన ప్రజల సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం కట్టబెట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
తెలంగాణ పోలీసులపై ఏపీలో కేసులు
తెలంగాణ పోలీసులు, ఏపీ పోలీసులపై కేసులు నమోదే చేయడమే కాకుండా.. అవసరమైతే అరెస్టు చేస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులపై కేసు పెట్టాలని టీడీపీ నిర్ణయించడంతో వివాదం మరింత ముదిరింది. టీడీపీకి సంబంధించిన డేటా చోరీ జరిగిందని పార్టీ తరుపున ఒక కేసు, అలాగే ఏపీ ప్రజలకు సంబంధించిన డేటాను దొంగతనం చేసారంటూ ప్రభుత్వం తరుపున మరో కేసు ఫైల్ చేయనున్నట్లు తెలుస్తుంది.ఆంధ్రప్రదేశ్ మీద లేని పోని నిందలు వేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చుకోవాలని నిన్ననే ముఖ్యమంత్రి కేబినెట్ లో నిర్ణయించారు. టీడీపీ కి సంబంధించిన డేటాను దొంగలించి వైసీపీకి మేలు చేకూర్చాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందని టీడీపీ ఆరోపిస్తుంది. తెలంగాణ పోలీసుల తీరు కూడా శృతి మించడంతో న్యాయపరంగానే వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు న్యాయనిపుణులతో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. బెంగాల్‌లో సీబీఐ అధికారులు ఆ రాష్ట్ర పోలీసులు నిర్భంధంలోకి తీసుకొన్నారని, ఇక్కడ కూడా అదే పరిస్థితి సృష్టించవచ్చునని ఒక మంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీకి రూ.5వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, పోలవరం ప్రాజెక్టు ఆపాలని కోర్టుల్లో కేసులు వేశారని, అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో విషం చిమ్ముతున్నారని మరోమంత్రి ఆక్రోశించారు. హైదరాబాద్‌లో ఐటీ గ్రిడ్ కంపెనీని ఫిబ్రవరి 23వ తేదీ నుంచే వేధిస్తున్నారని మంత్రి లోకేశ్ చెప్పారు.
No comments:
Post a Comment