Breaking News

22/03/2019

పాక్‌ నేషనల్‌ డేను బహిష్కరించిన భారత్‌

న్యూఢిల్లీ మార్చ్ 22 (way2newstv.in
ఢిల్లీలోని పాకిస్థాన్‌ మిషన్‌లో శుక్రవారం జరగబోయే పాకిస్థాన్ నేషనల్‌ డే వేడుకలకు భారత ప్రభుత్వం తరఫున ఏ అధికారి వెళ్లడం లేదు. ప్రతి సంవత్సరం మార్చి 23న జరిగే ఈ వేడుకలను పాకిస్థాన్‌ ఈసారి ఒకరోజు ముందుగానే జరుపుకోవాలని నిర్ణయించింది. భారత్‌ తరఫున ఒక కేంద్ర మంత్రి ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరు కావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమానికి కశ్మీర్‌ వేర్పాటువాద నేతలను ఆహ్వానించిడం వల్లే కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


పాక్‌ నేషనల్‌ డేను బహిష్కరించిన భారత్‌

పుల్వామా ఉగ్ర దాడి తరవాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. పాక్‌లోని భారత్ అధికారులను అక్కడి భద్రతా సిబ్బంది పదే పదే వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలకు సంబంధించి మార్చి 18న పాక్‌ విదేశాంగ శాఖకు భారత్‌ నివేదించింది. వెంటనే దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.

No comments:

Post a Comment