ఎన్నికల అంకంలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం పది గంటలకు ఎపిలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఎపి ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది. దేశంలోనే ఎన్నికల్లో ఎక్కువ డబ్బులు ఖర్చయ్యే రాష్ట్రం ఎపి అని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో.రాష్ట్రంలో ధనప్రవాహానికి అడ్డుకట్టవేయడానికి ఇసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది..ఇందు కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఎపికి ప్రత్యేకంగా 25 పార్లమెంట్ నియెజకవర్గాలకు 25 మంది ఇండియన్ రెవిన్యుసర్విస్ అధికారులను కేటాయించగా.., 175 నియోజకవర్గాలకు 77 మంది ఇన్ కం ట్యాక్స్ , కస్టమ్స్ అధికారులను పంపుతోంది.. వారు నేటి నుండి ఎపిలో అందుబాటులో ఉండనున్నారు.. వీరంతా అయా అభ్యర్ధులు చేసే ప్రతిపై సా ఖర్చు పై లెక్కలు కట్టనున్నారు.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. వైయస్ వివేకా హత్య అనంతరం రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలపై రోజువారి నివేదికలు కోరుతున్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడేది లేదని, ఎన్నికల్లో నిలబడే ప్రతి అభ్యర్ధి ఖర్చుచేసే ప్రతిపైసా లెక్క కడతామని ఆయన ప్రకటించారు.
ఎన్నికల ఖర్చులోనూ..ఏపీనే టాప్
దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగి దాదాపు 9 రోజులైంది. తొలి విడత ఎన్నికలు జరిగే ఎపిలో నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి మొదలైంది. ఉదయం పది గంటలకు నోటిఫికేషన్ ఇసి ప్రకటిస్తే.. ఉదయం 11 గంటలనుండి నేరుగా అభ్యర్ధులు అయా రిటర్నింగ్ అధికారులు వద్ద నామినేషన్ చేసుకోవచ్చు. ఇప్పటికే నామినేషన్ కు కావాల్సిన ఎన్నికల పత్రాలు అన్ని సిద్దం చేసినట్లు అయన తెలిపారు. ప్రతి అభ్యర్ధి ఎన్నికల కోడ్ ను తప్పకుండా అమలు చేయాలని, ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలని అందుకు ఎన్నికల సంఘాని అభ్యర్ధులు సహకరించాలని ద్వివేది విజ్ఞప్తి చేశారు. నామినేషన్ వేయడానికి 25 తేది వరకే గడువు ఉందని, 28 నామినేషన్లను అన్ని పరిశీలిన పూర్తి చేస్తామన్నారు.ఎపిలో మొత్తం నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గోననున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలట్ పై అవగాహన ఈ నెల28 నుండి 31 వరకు నిర్వహిస్తామన్నారు. అవగాహన సదస్సు చివరి రోజే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందజేస్తామన్నారు.ఈ సారి పార్టీ అభ్యర్దులు గుర్తుతో పాటు వారి పోటో కూడా ఇవియం లపై ముద్రిస్తున్నామన్నారు.వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనంతరం రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టిసారించింది ఇసి..ఇప్పటికే రాయలసీమ లో పలు సంఘటనలు జరిగాయి. దీంతో ఇక ప్రతి రోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డిజిపి ప్రతిరోజు శాంతి భద్రతలపై వేరువేరుగా నివేదికలు పంపమని ద్వివేది అదేశించారు. ప్రతి రోజు వచ్చే నివేదికలపై నిత్యం వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికల రూపంలో పంపుతున్నామన్నారు ఎపిలో ఎన్నికల్లో భద్రతకోసం కేంద్రం నుండి 90 కంపెనీల పారామిలటరీ బలగాలు రాష్ట్రానికి వచ్చాయని సిఇవో ప్రకటించారు.శాంతి భద్రతలపై రాజీ పడరాదని పోలీస్ శాఖను అదేశించామన్నారు..ఇక పై రాష్ట్రంలో ఎలాంటి చిన్న ఘటన జరగకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.అంతే కాదు అభ్యర్ధుల గెలుపు కోసం నిధులు తరలింపు తో పాటు.. ఎవరి పైనా అయినా అనుమానం ఉంటే వేంటనే రైడ్స్ కూడా చేయనున్నారు..
No comments:
Post a Comment