జగిత్యాల మార్చి 19 (way2newstv.in):
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. ఈనెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు అయితే పలువురు అభ్యర్థులు గత ఎన్నికల్లో నామినేషన్లు నిబంధనల మేరకు పూరించక తగిన పత్రాలు జత చేయకపోవడంతో వారి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం జగిత్యాల జిల్లా గౌరవాధ్యక్షుడు హరి అశోక్ కుమార్ నామినేషన్లు దాఖాలు సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు, జత పరచాల్సిన పత్రాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాచారానని వివరించారు.
- నామినేషన్ ఫారంలోని అన్ని కాలములను పూరించాలి. అందులో పేర్కొన్న అంశాలకు సంబంధించి అవును/కాదు అని ఏదో ఒక సమాధానం వ్రాయాలి. ఏ ఒక్క కాలం వదిలిపెట్టినా నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది.
- నామినేషన్ ఫారం తో పాటు 2×2.5 సెంటీమీటర్ల పాస్ పోర్టు ఫోటో జత చేయాలి ,ఫోటో సాధారణంగా దిగింది ఉండాలి .అభ్యర్థి నల్ల కళ్లద్దాలు తలకు టోపీతో ఫోటో దిగవద్దు
ఎంపీ అభ్యర్థుల నామినేషన్ కు నిబంధనలు
- వ్యక్తిగత వివరాలతో పాటు మెయిల్ ఐడి ఫేస్బుక్, ట్విట్టర్ ల అకౌంట్ లు తెలుపాలి .అభ్యర్థి తో పాటు కుటుంబ సభ్యులకు సంబంధించి ఐదు సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్ సమర్పించాలి.
- నేర చరిత్ర పెండింగ్ కేసుల వివరాలు ఆయా కేసులకు సంబంధించిన కోర్టు తీర్పుల సమాచారాన్ని తెలుపాలి. అభ్యర్థుల అఫిడవిట్ ను ఆన్ లైన్ లో అప్లోడ్ చేస్తారు. అభ్యర్థులు ఎవరైనా తప్పుడు ప్రమాణ పత్రం దాఖాలు చేశారని భావిస్తే ప్రజా కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది దానిపై ఎన్నికల అధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటారు.
- సమర్పించే అఫిడవిట్ లో స్థిర ,చర ఆస్తుల చేతిలో ఉన్న నగదు బంగారం తదితర విలువైన నగల వివరాలు ప్రభుత్వ అప్పులు ,ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు జమ ఉన్న వివరాలు పొందుపరచాలి.
- అభ్యర్థులు కొత్త బ్యాంకు ఖాతా ఈ ఎన్నిక నిమిత్తం తెరువాలి ఆ బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలి ,ఎన్నికలకు సంబంధించిన ఖర్చులన్నీ ఆ ఖాతా ద్వారానే నిర్వహించాలి.
- పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎంపీగా పోటీచేసే అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకుకు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
-నామినేషన్ దాఖలు సందర్భంగా నామినేషన్ దాఖలు చేయనున్న అభ్యర్థి వెంట వచ్చే కాన్వాయ్ వాహనాలు నామినేషన్ దాఖలు కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే నిలిపివేయాలి. 3కార్లు మాత్రం కార్యాలయం వద్దకు రావొచ్చు. అభ్యర్థి తోపాటు నామినేషన్ దాఖలు చేయడానికి రిటర్నింగ్ అధికారి వద్దకు ఐదుగురు వ్యక్తులు వచ్చేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది.
No comments:
Post a Comment