తుగ్గలి మార్చ్ 12 (way2newstv.in)
ఎన్నికల కోడ్ అమలుతో గ్రామాలలో గల ఫ్లెక్సీలను,స్టిక్కర్లను అధికారులు తొలగిస్తున్నారు.ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల వ్యవధి ఉండడంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తుగ్గలి మండలం లోని మొదటి ఫ్లయింగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో జొన్నగిరి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఫ్లెక్సీలను మరియు స్టిక్కర్లను తొలగించారు.
ఎన్నికల కోడ్ అమలుతో ఫ్లెక్సీ లు తొలగింపు
ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఆధారంగా ఫ్లెక్సీలను తొలగిస్తున్నామని,అదేవిధంగా నాయకుల విగ్రహాలను కవర్లతో పూర్తిగా కప్పి వేస్తామని అధికారులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో లో డిప్యూటీ తాహసిల్దారు నిజాముద్దీన్ మరియు జొన్నగిరి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment