Breaking News

08/03/2019

గోదాముల్లో చేరుతున్న మిర్చి

మహబూబ్ నగర్, మార్చి 8 (way2newstv.in)
గిట్టుబాటు లేని ధరలతో రైతన్న గిలగిలాడుతున్నాడు. గత ఏడాది ధరలను దృష్టిలో ఉంచుకొన్న రైతులు మిర్చి పంటలసాగుకు మొగ్గుచూపారు. పం టలు చేతికొచ్చిన సమయంలో ధరలు పటాలున పడిపోయాయి. దీంతో రైతులు ఓ వైపు అమ్మలేక మరో వైపు దాచుకోలేక తల్లడిల్లుతున్నాడు. సాగుచేసిన మిర్చిని కంటికి రెప్పలా కాపాడుకున్న అన్నదాత చేతికొచ్చిన పంటను దాచుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. మిర్చిని శీతల గోదాములలో నిల్వచేయటానికి రైతులు శీతల గోదాములకు క్యూ కడుతున్నా రు. ఏసి గోదాములు మిర్చి ఘా టుతో నిండిపోయాయి. నిర్వాహకులు గోదాములు ఖాళీ లేదని సమాచారం ఇచ్చినా రైతులు గోదాముల వద్దే కాపలాకాస్తున్నారు. గత ఏడాది మిర్చి క్వింటాలుకు రూ 12వేలు పలికింది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న రైతులు ఏడాది అదే ఆశతో సాగుచేశారు. మి ర్చి పంట చేతికి వచ్చేముందు ధర రూ 8 నుంచి 9వేల వరకు వచ్చింది. 


గోదాముల్లో చేరుతున్న మిర్చి

పంట చేతికి రా గానే ధర ఢమాల్‌న పడిపోయిది. ఈ ఏడాది మిర్చిసాగు అధికంగాసాగుచేశారు. ఉండవెల్లి మండల పరిధిలో 1800 ఎకరాలు, గద్వాల లో1500 ఎకరాలు, ధరూర్ 1400, గట్టు 18 00, మల్దకల్ 3500, కెటిదొడ్డి 1200, అయిజ 2200, అలంపూర్ 2600, మానవపాడు 3600, ఇటిక్యాల 2675, వడ్డెపల్లి 4200 ఎకరాలలో సాగుచేశారు. దశలవారీగా సేకరించిన మిర్చి ధరలు పడిపోవటంతో ఎర్రని గుట్టలా మారింది. దిక్కుతోచని రైతన్న బిక్కమొగం వేశాడు. అమ్ముకోలేక, దాచుకునేందుకు చేసిన ప్రయత్నం రైతుకు కునుకు లేకుండా చేసింది.అలంపూర్ తాలూకాపరిధిలో ఐదు ఏసి గోదాములున్నాయి. ఏసి గోదాములలోనిల్వచేసేందుకు రైతులు మిర్చితో ట్రాక్టర్‌లతో గోదాములకు చేరుకున్నారు. అధిక సంఖ్యలో రైతులు గోదాములకు రావటంతో ట్రాక్టర్లు బారులుతీరాయి.గోదాములకు చేర్చేందుకు రైతు రెండు మూడురోజులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు దాపురించాయి. గిట్టుబాటు దర వచ్చే వరకు రైతులు వేచిచూసే దశలో ఉన్నారు. దళారులు సైతం కనె్నత్తి మిర్చివైపు చూడటంలేదు. ప్రభుత్తం పట్టించుకునే పరిస్థితులు కనిపించటం లేదు. మిర్చి రైతులను ఆదుకునే నాధుడేవ్వరో వేచిచూడాల్సిందే.

No comments:

Post a Comment