Breaking News

08/03/2019

18 మండలాల్లో ఉపాధి హామీ పథకం

అదిలాబాద్, మార్చి 8, (way2newstv.in)
అదిలాబద్ జిల్లాల్లో ఉపాధి హామీ పథకం కింద ఆదిలాబాద్‌ జిల్లాలోని మొత్తం 18 మండలాల్లో ఉపాధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా లక్షల మంది కార్మికులు ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే వేలాది మంది మంది కూలీలకు పనులు కల్పించారుమహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వహణ వ్యవస్థను పూర్తిస్థాయిలో మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కూలీల సంఖ్యను పెంచేందుకు వేసవి కరువు భత్యాన్ని పెంచింది. ఇదే క్రమంలో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరులో అలసత్వాన్ని ప్రదర్శించకుండా ఉండేందుకు పలు నిబంధనలు విధించింది. ఇక నుంచి ఉన్నతాధికారులకు సకాలంలో సమాచారం పంపకుంటే వారి వేతనంలో 25 శాతం కోత పడనుంది. ఈ మేరకు రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ కమిషనర్‌ నుంచి ఆదేశాలందాయి. ఇదివరకు కూలీలు వచ్చినా, రాకపోయినా డిమాండ్‌ (దరఖాస్తులు) పంపించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. 


18 మండలాల్లో ఉపాధి హామీ పథకం

దీంతో కూలీలకు సరైన న్యాయం జరగకపోయేది. గతంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనికి సంబంధించి డిమాండ్లు పంపకుంటే ఆయా మండలాల ఏపీవోలు తమ ఉన్నతాధికారులకు సంబంధిత విషయంలో సమాధానం చెప్పుకునేవారు. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. పరిస్థితి మెరుగుపరిచే క్రమంలో ఉన్నతాధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బంది వేతనంలో కోత విధించేందుకు వెనుకడుగు వేయకుండా ఆదేశాలను తప్పకుండా పాటించాలని కమిషనర్‌ ఆదేశాలు జారీ చేయడంతో ఏపీవోలు ఫీల్డ్‌ అసిస్టెంట్లకు నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆదేశాలను జారీచేశారు. లేకపోతే వేతనంలో కోత విధించేందుకు చర్యలు తప్పవని ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఇప్పటికే హుకుం జారీచేశారు. తాజాగా విడుదలైన జీవోతో సిబ్బంది తీరులో మార్పురావడంతోపాటు కూలీలకు ప్రయోజనం చేకూరుతుంది. మార్చి నుంచి అన్ని గ్రూపులకు పని కల్పించాల్సి ఉంటుంది. కూలీలు పనికి రాకపోతే లిఖిత పూర్వకంగా తీసుకోవాల్సి ఉంటుంది. పని అడిగిన వారు ఎంత మంది ఉన్నారు. పనికి హాజరుకానివారు ఎంత మంది అనే సమా చారం నిత్యం సెల్‌ ద్వారా ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంటుంది. లేకుంటే వారి వేతనంలో 25 శాతం తగ్గిస్తారు. నిర్లక్య్షంగా వ్యవహరించిన వారు వారంలో రూ.556 వరకు కోల్పోతారు. ఆటోమేటిక్‌గా జీతంలో కోత విధించేలా సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించారు. 

No comments:

Post a Comment