Breaking News

23/03/2019

ఓటుతో వైసీపీకి బుద్ది చెప్పాలి

తెలుగుదేశం ఎమ్మెల్యే బి.వి జయనాగేశ్వరరెడ్డి 
ఎమ్మిగనూరు, మార్చ్ 23 (way2newstv.in)   
 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం 7 గంటల నుండి పట్టణంలోని 13వ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా తేదేపా నాయకులు,కార్యకర్తలతో బి.విజయనాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. అయన మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసిపికి మీ ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే బి.వి జయనాగేశ్వరరెడ్డి  ప్రజలను కోరారు.

ఓటుతో వైసీపీకి బుద్ది చెప్పాలి

అలుపెరగకుండ ఇంటింటి ప్రచారంలో పాల్గొంటూ ఇంటింటికి వెళ్లి ఆదరించండి, అభివృద్ధిని చూసి ఓటు వేసి గెలిపించండి అమ్మ, అయ్యా అంటూ దండాలు పెట్టి తెలుగుదేశంను గెలిపించండి,సైకిల్ గుర్తుకు ఓటు వేయండి అని వార్డు ప్రజలను కోరారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు మళ్లీ మళ్లీ అమలు లోకి రావాలంటే తెలుగుదేశం రావాలని అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం ముందుండాలని భారీ మెజార్టీ తో గెలిపించాలని ఇంటింటి ప్రచారం లో ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, వార్డు ఇన్చార్జర్ లు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment