హైదరాబాద్.మార్చి 23,(way2newstv.in)
గత ఐదేళ్లలలో ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరోజు సెలవు తీసుకోలేదు. మోడీకి ఫార్మ్ హౌస్ లేదు రెస్ట్ హౌస్ లేదు. విదేశాల్లో రిసార్ట్స్, రిక్రియేషన్ క్లబ్స్ లేని వ్యక్తి మోడీ అని బీజేపీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం పార్టీ నిర్వహించిన మైన్ బి చౌకీదార్ కార్యక్రమంలో అయన మాట్లాడారు. దేశానికి నిజమైన చౌకిదార్ మోడీ. ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చూసినా ఫ్యామిలీ వారసులే. ఒక్క బీజేపీనే వారసత్వం లేని పార్టీ అని అయన అన్నారు. సికింద్రాబాద్ నుంచి నాతోటి అభ్యర్థులా నాకు వారసత్వం లేదు. 24 గంటల్లో అభినందన్ ఇంటికి ఎలా వచ్చాడో ప్రజలు ఆలోచించాలి.
దేశానికి నిజమూన చౌకీదార్ మోడీనే
25 వ తేదీన బషీర్ బాగ్ లోని అమ్మవారికి పూజచేసి హైదరాబాద్ కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేస్తానని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ కేసీఆర్ మోదికన్న పెద్ద హిందువు అవునో కాదో కానీ, ఓవైసీ కన్నా పెద్ద ముస్లిం కేసీఆరని అన్నారు. కేసీఆర్ ది ఫ్యామిలి ఫ్రంట్. నీ ప్రధాని అభ్యర్ధి ఎవరని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ 130 కోట్ల భారతీయులలో దేశం కోసం పనిచేసే ప్రతిఒక్కరు చౌకిదారే. కరెంట్ లేని గ్రామం లేకుండా చేసాం. 5 లక్షల వరకు ఆదాయ పరిమితి చేసాం. 3 కోట్ల మంది మినహా మిగిలిన వారినందరిని టాక్స్ మినహాయింపు చేసామని అన్నారు. 5 ఏళ్ళ పాలనలో ప్రతి మే నెల 25 వ తేఈదిన దేశ అభివృద్ధి ప్రగతిని ప్రజల ముందు పెట్టామని అన్నారు. మోడీ రావడం ఇష్టం లేక దేశంలో అవినీతి పరులు ముఠా కట్టారు. పంచభూతాలను కాంగ్రెస్ దోసుకోవడం వదల్లేదు.2008 లో టెర్రరిస్టులు ముంబయి ఎటాక్ చేసినప్పుడు కాంగ్రెస్ ఎం చేసిందని అన్నారు. దేశ రక్షణ లో వెనక్కి తగ్గేదిలేదు,ఎందుకంటే మేము నిజమైన చౌకిదార్లమని అయన అన్నారు.
No comments:
Post a Comment