బాలనాగిరెడ్డి గెలుపుకు కృషిచేస్తా
టిడిపి తిక్కా రెడ్డికి ఘోరపరాజయం తప్పదు.
- మాధవరం రామిరెడ్డి
మంత్రాలయం, మార్చ్ 23 (way2newstv.in)
టిడిపి సీనియర్ నాయకుడు మాధవరం రామిరెడ్డి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం జగన్మోహన్ రెడ్డి తో సమావేశమయిన తర్వాత సీతారామిరెడ్డి బాలనాగిరెడ్డి సమక్షంలో లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మాధవరం రామిరెడ్డి రామకృష్ణారెడ్డి రాఘవేంద్ర రెడ్డి రామ్మోహన్ రెడ్డి లకు వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.మంత్రాలయం నియోజకవర్గంలో బాల నాగిరెడ్డి విజయానికి కృషి చేయాలని ఆయన సూచించారు.వైసీపీ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం ఉంటుందని తెలిపారు .
జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం.
రామిరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు 2019 ఎన్నికలలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ని అఖండ విజయంతో గెలిపించుకుంటామని టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి ని ఘోర పరాజయం పాలు చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గంలో వాల్మీకి నాయకుడైన మాధవరం రామ్ రెడ్డి టిడిపి పార్టీ నుంచి వైసీపీ పార్టీ కి మారడంతో రామిరెడ్డి వాల్మీకి వర్గమంతా వైసిపి పక్షం కానున్నది దీంతో 2019 ఎన్నికలలో టిడిపికి ఘోరపరాజయం తప్పదని తిక్కారెడ్డి పై వైసిపి అభ్యర్థి బాలనాగిరెడ్డిని 30 వేల మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు.నియోజకవర్గంలోని వాల్మీకుల వర్గమంతా మా వెంటే ఉంటా రని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment