Breaking News

21/03/2019

ఆడేదెట్టా..? (మెదక్)

మెదక్, మార్చి 21 (way2newstv.in): 
చదువుతో పాటు క్రీడల్లోనూ పాల్గొనండని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆటలపోటీలు జరిగిన ప్రతిచోటా వక్కాణిస్తూనే ఉంటారు కానీ పిల్లలు, యువకులు ఆడుకోవడానికి సరైన స్థలాలు, సౌకర్యాలు ఉన్నాయా అని చూడరు. స్థలాలు, నిధులు, ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఆయా పనులు సక్రమంగా పూర్తయ్యాయా లేవా అని అనుశీలించరు. తమకేమీ పట్టనట్టు ప్రభుత్వ యంత్రాంగం ఉంటోంది. ఎలాంటి ప్రోత్సాహం లేకపోయినా క్రీడలపై తమకు ఉన్న ఆసక్తితో నైపుణ్యాలు పెంపొందించుకుంటూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటున్న హుస్నాబాద్‌ ప్రాంత క్రీడాకారులకు కనీస మౌలిక సదుపాయాలు కరవయ్యాయి. క్రీడల సాధన కోసం సరైన వేదిక లేదు.
వాలీబాల్‌, కబడ్డీ, క్రికెట్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, క్యారమ్‌, చెస్‌, సైక్లింగ్‌, కరాటే తదితర క్రీడల్లో ప్రతిభ కలిగి వివిధ స్థాయిల పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ఉన్నారు. నైపుణ్యాల పెంపునకు సాధన చేయడానికి ఏర్పాటు చేయతలపెట్టిన క్రీడా మైదానాల అభివృద్ధికి ఆటంకాలే ఎదురవుతున్నాయి. దాదాపు దశాబ్దకాలానికి పైగా హుస్నాబాద్‌లో మినీ స్టేడియం, ఇండోర్‌ స్డేడియంల నిర్మాణం కోసం అప్పటి ప్రజాప్రతినిధులు తలపెట్టిన ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఈ పనులు రెండు అడుగులు ముందుకు మూడు అడుగులు వెనక్కి అన్న మాదిరిగా పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ రెండు స్టేడియంల నిర్మాణ పనులు ప్రారంభమైన మినీ స్టేడియం నిర్మాణం 50శాతం, ఇండోర్‌ స్టేడియం పదిశాతం పనులు జరిగి బిల్లులు చెల్లింపుల్లేకపోవడంతో గుత్తేదారు పనులను నిలిపివేశారు.


 ఆడేదెట్టా..? (మెదక్)

మినీ స్టేడియం నిర్మాణం కోసం ఎనమిదేళ్ల క్రితమే రూ.కోటి మంజూరయ్యాయి. ఈనిధులతో వాకింగ్‌ ట్రాక్‌, పెవిలియన్‌ బిల్డింగ్‌, స్మిమ్మింగ్‌పూల్‌, బాస్కెట్‌, వాలీబాల్‌ కోర్టులు, ప్రహరీగోడ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ముందుగా ప్రహరీగోడ నిర్మాణం కొనసాగుతున్న సమయంలో స్థల వివాదం కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. దీనితోపాటు పెవిలియన్‌ కొంత నిర్మాణం చేసి వదలివేశారు. దాదాపు మూడు నాలుగేళ్ల పాటు స్ధల వివాదం కొనసాగింది. టెండరు రద్దు చేసి మళ్లీ రీటెండర్‌ చేసి పనులు ప్రారంభించారు. పెవిలియన్‌ భవనం, బాస్కెట్‌బాల్‌, వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణం పూర్తి చేశారు. బిల్లుల చెల్లింపులు జరుపడం లేదని గుత్తేదారు పనులను నిలిపివేశారు. ప్రహారీ గోడ నిర్మాణం సగంలోనే ఆగిపోయింది. సిమ్మింగ్‌ పూల్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా నిధులు సరిపోవని, ఆ పనిని ఇందులో నుంచి తొలగించారు. దాదాపు మూడు నెలలుగా పనులు నిలిచిపోయాయి.
హుస్నాబాద్‌లో ఇండోర్‌ గేమ్స్‌ కోసం పదేళ్ల క్రితం స్టేడియం నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించి పాత కూరగాయల మార్కెట్‌ స్థలంలో నిర్మాణాన్ని చేపట్టారు. అప్పటి ఎంపీ జి.వెంకటస్వామి తన కోటా నిధులు రూ.10లక్షలు కేటాయించగా లెంటల్‌ వరకు నిర్మాణ పనులు చేసి నిధుల కొరత కారణంగా మద్యలోనే నిలిపివేశారు. దీని నిధుల కోసం నాలుగైదేళ్లు అసంపూర్తిగా ఉంది. చివరకు రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. ఈనిధులతో పనులు టెండరు నిర్వహించడానికి సాంకేతికపరమైన కారణాలు అడ్డుగా నిలిచాయి. అసంపూర్తిగా నిలిచిపోయిన భవనం గట్టితనం కోల్పోయిందని, గోడల్లో నాణ్యత లేదంటూ చర్చకు వచ్చాయి. చివరకు మినీ స్టేడియంలోనే ఇండోర్‌ స్టేడియం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించి టెండర్‌ నిర్వహించారు. గత సంవత్సరం శంకుస్థాపన చేశారు. తర్వాత పనులు చురుకుగా ప్రారంభం అయ్యాయి. ఇక్కడ సత్వరమే పనులు పూర్తవుతాయని అందరూ భావించారు. చివరకు పునాదుల్లోనే గుత్తేదారు పనులు నిలిపివేశారు. ఇదేమిటని విచారిస్తే బిల్లుల చెల్లింపు చేయలేదని గుత్తేదారు పనులు ఆపేశారని చెబుతున్నారు. మూడు నెలలుగా అసంపూర్తిగా నిలిచిపోయాయి.

No comments:

Post a Comment