Breaking News

23/03/2019

బెల్లం నిల్వలున్న దుకాణాలపై దాడులు

బెల్లం బస్తాలను ఫ్రీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు
 మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలుపుట కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
పత్తికొండ, మార్చ్ 23 (way2newstv.in)  
పత్తికొండ టౌన్ లో బెల్లం నిల్వలు ఉన్న దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టౌన్ లోని బెల్లం బస్తాల నిల్వ ఉన్న కిరాణం షాపులలో తనిఖీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా పత్తికొండ ఎక్సైజ్ సీఐ మంజుల మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సారాను అరికట్టేందుకే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని సీఐ తెలిపారు.పత్తికొండ టౌన్ లో మొత్తంగా 30 కేజీల బరువుతో ఉన్న 95 బెల్లం బస్తాలను ఫ్రీజ్ చేసామని వారు తెలిపారు.పోలీసులు ఫ్రీజ్ చేసిన బెల్లం బస్తాలను గదిలో భద్రపరచి సీలు వేశారు.


బెల్లం నిల్వలున్న దుకాణాలపై దాడులు

సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ వారు టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారని సీఐ మంజుల తెలిపారు.ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన పోస్టర్లను నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద పంచాయతీ కార్యాలయాల వద్ద పొందపరిచామని సీఐ తెలిపారు.బెల్ట్ ను అదుపు చేయడానికి నియోజకవర్గ పరిధిలోని అన్ని వైన్ షాపుల నుంచి డైలీ సేల్స్ ను పరిశీలిస్తున్నామని తెలియజేశారు.అదేవిధంగా కల్తీ మద్యం రాష్ట్రంలోకి రాకుండా బార్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని సీఐ తెలియజేశారు.ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రతి శనివారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని వారు తెలియజేశారు.ఎన్నికల సమయంలో కల్తీ మద్యం సరఫరా కాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని పత్తికొండ ఎక్సైజ్ సీఐ మంజుల తెలియజేశారు.నిషేధిత పదార్థాలు ఎవరైనా సరఫరా చేస్తుంటే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తమకు సమాచారం ఇవ్వాలని సీఐ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ నాగరాజు,పత్తికొండ ఎస్సై కృష్ణయ్య మరియు ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment