Breaking News

26/03/2019

కేసీఆర్ సభను విజయవంతం చేయాలి

వరంగల్,  మార్చి 26  (way2newstv.in)             
ఏప్రిల్ 2న జరగబోయే సియం కేసీఆర్ సభను  విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ శ్రేణులను కోరరు. మంగళవారం నాడు  అజంజాహి మిల్లు మైదానంలో  సభాస్థలిని పరిశీలించిన ఎర్రబెల్లి తరువాత మీడియాతో మాట్లాడారు. ఈ  పార్లమెంట్ ఎన్నికలతో టిఆర్ఎస్ చరిత్ర సృష్టించబోతుంది.  తెలంగాణ అభివృద్ది కాక్షించే పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు.   వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయింది.  చరిత్రలో నిలిచే విధంగా భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యమని అన్నారు.  



కేసీఆర్ సభను విజయవంతం చేయాలి

ఉధ్యమాలగడ్డ ఉమ్మడి వరంగల్ జిల్లాను అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి.  కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యానికి సాక్ష్యంగా అజంజాహి మిల్లును అమ్మేసుకున్నారు. రేయాన్స్ కార్మాగారం మూతపడటానికి కారణమయ్యారు.
నేడు  సియం కేసీఆర్ టెక్ట్స్ టైల్ పార్క్ నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా గోదావరి జలాలను సద్వినియోగం చేయడానికి కృషి చేస్తున్నారు.  తెలంగాణ అభివృద్ధికి ఇతర పార్టీలు సైతం టిఆర్ఎస్ కు మద్దతుగా పోటి నుండి విరమించుకుంటే బాగుంటుందన్నారు.  నిధులు, హోదాలు సాధించేందుకు..16 ఎమ్పీ సీట్లను తెలంగాణ ప్రజలు బహుమానంగా  సియం కేసీఆర్ కు అప్పగించాలని కోరారు. 

No comments:

Post a Comment