కౌతాళం మార్చి 26 (way2newstv.in)
రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో నా భర్తకు ఆదరించి అభిమానించి ఓట్లు వేసి గెలిపించాలని టిడిపి అభ్యర్థి తిక్కా రెడ్డి సతీమణి వెంకటేశ్వరమ్మ ఇంటింటి ప్రచారం లో కోరారు. రెండుసార్లు బాల నాగి రెడ్డి ని గెలిపించారు. ఈసారి నా భర్త తిక్క రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని అభివృద్ధి చేసి చూపిస్తారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలవాలంటే తెలుగుదేశం గెలిపించాలని మరొకసారి కోరారు. ప్రతి ఒక్కరు రెండు సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను మరీ మరీ కోరారు.
నా భర్తకు గెలిపించండి
నా భర్తకు ఓటు వేసి గెలిపిస్తే ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి చేసి చూపిస్తారని టీడీపీ అభ్యర్థి తిక్క రెడ్డిసతీమణి వెంకటేశ్వరమ్మ, పేర్కొన్నారు. ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో కౌతాళం మండల పరిధిలోని రౌడుర్, విర్ల దీన్నే, బాపూరం, గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్తులు తిక్క రెడ్డి సతీమణి వెంకటేశ్వరమ్మ కు మహిళలు మంగళ హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఆహ్వానించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు ప్రకటించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. కౌతళం మండలం పరిధిలోని అన్ని గ్రామాలలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని తెలుగుదేశం చంద్రబాబును మరొక్కసారి అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించి ముఖ్య మంత్రి అసెంబ్లీ కి పంపిస్తే ఇంకా అభివృద్ధి పనులు చేసి చూపిస్తారని మా భర్తకు ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ ఇంటింటి ప్రచారంలో టిడిపి నాయకులు సీనియర్ నాయకులు ఉలి గాయ్య, సుదీర్ రెడ్డి,చెన్న బసప్ప, వెంకటపతి రాజు, అడి వప్ప గౌడ్ సురేష్ నాయుడు, టిప్పు సుల్తాన్, కొట్రేష్ గౌడ్, నాయకులు కార్యకర్తలు,గ్రామస్తులు, పాల్గొన్నారు.
No comments:
Post a Comment