Breaking News

26/03/2019

లింగాపూర్ గ్రామంలో పోలీసుల కార్డన్ సెర్చ్

పది ద్విచక్ర వాహనాలు సీజ్
ములుగు, మార్చి 26  (way2newstv.in)             
ములుగు జిల్లా వెంకటాపూర్ మండల పరిధిలోని మంగళవారం తెల్లవారుజామున లింగపూర్ గ్రామంలో వెంకటాపూర్ పోలీసులు సివిల్ , సీఆర్పీఎఫ్ పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుటకు పోలీసులు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యగా సరెండర్ అయినటువంటి మావోయిస్టు మరియు ప్రతి ప్రజా ప్రతిఘటన పార్టీలకు సంబంధించిన మిలిటెంట్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం, మరియు వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం, 


లింగాపూర్ గ్రామంలో పోలీసుల కార్డన్ సెర్చ్ 

సత్ప్రవర్తన కొరకు ఎమ్మార్వో ఎదుట హాజరు పరచడం లాంటివి చేస్తున్నారు.ములుగు సిఐ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుట కొరకు మీ వంతు సహాయం అందించాలని ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు సమాచారం పోలీసులకు అందించాలని ఒకరిని ఒకరు కించపరిచే విధంగా మాట్లాడుకోవడం తిట్టుకోవడం ద్వేషించడం చేయకూడదని హెచ్చరించారు.ఈ కార్డన్ అండ్ సెర్చ్ లో సరియైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ములుగు సీఐ సార్ల రాజు మరియు వెంకటాపూర్ ఎస్సై నరహరి సివిల్, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. 

No comments:

Post a Comment