పోలీసులకు ఫిర్యాదు చేసిన వైకాపా
హైదరాబాద్, మార్చి 2(way2newstv.in)
ఏపీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల డాటా చోరీ అయింది. లబ్ధిదారుల డాటా మొత్తం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కంపెనీ కార్యాలయం లో ఉన్నట్లు వైసిపి ప్రతినిధి విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేసారు. శనివారం నాడు వైకాపా నేతలు ఇచ్చిన ఫిర్యాదు పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసారు. బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ కంపెనీ పై కేసు నమోదు అయింది. కూకట్ పల్లిలోని సంస్థ కార్యాలయంలో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సోదాలు జరిపారు.
ప్రభుత్వ పథకాల లబ్దిదారులు డాటా చోరీ
ఏపీ ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డాటా మొత్తం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో ఎలా ఉందనే కోణంలో సోదాలు జరిగాయి. ఏపీ ప్రభుత్వ లబ్ధిదారుల ఓటర్ కార్డు ఆధార్ కార్డులు హైదరాబాద్లోని ప్రైవేట్ కంపెనీ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. కైకట్ పల్లిలో ఉన్న సంస్థ రెండు ప్రధాన కార్యాలయంలో సోదాలు కొనసాగాయి. ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల డేటా హైదరాబాదు లో ని ఓ ప్రైవేటు ఐటీ కంపెనీ దగ్గర వున్నాయని డేటా చౌర్యం పై యాక్షన్ తీసుకోవాలని వైకాపా నేతలు ఫిర్యాదులో పేర్కోన్నారు. ప్రైవేటు సంస్థ చేతికి లబ్దిదారుల జాబితా చేరడంపై వైసీపి అందోళన వ్యక్తం చేసింది. కీలకమైన డేటాలు ప్రైవేట్ కంపెనీలకు ఎలా చేరాయన్న దానిపై విచారణ జరిపించాలని ఫిర్యాదు లో విజయ సాయి రెడ్డి పోలీసులను కోరారు.
No comments:
Post a Comment