వికారాబాద్, మార్చ్ 12 (way2newstv.in)
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటూ వికారాబాద్ లో ఆయన మంగళవారం దీక్షకు దిగారు. అయితే, ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో, ఆయన దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో దీక్ష శిబిరం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఆరెస్టు
ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాంమోహన్ రెడ్డి,మాజీ ప్రసాద్కుమార్, కే ఎస్ రత్నం లను పోలీసులు అరెస్ట్ చేసారు. దీక్ష సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. గత ఐదేళ్లలో జిల్లాకు ఒక కొత్త ఉద్యోగం కూడా రాలేదని మండిపడ్డారు. ఒక్క ఎకరానికి కూడా సాగు నీటిని ఇవ్వలేకపోయారని విమర్శించారు.
No comments:
Post a Comment