Breaking News

30/03/2019

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మరాఠ పోరు

ముంబై, మార్చి 30 (way2newstv.in)
మరాఠా పోరు ఆసక్తికరంగా మారింది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక స్థానాలున్న రాష్ట్రం మహారాష్ట్ర. అందుకోసమే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లు మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. మోదీపై వ్యతిరేకత, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనపై అసంతృప్తి ఈ ఎన్నికల్లో తమను విజయపథాన నడిపిస్తాయని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. అయితే మరాఠా ప్రాంతంలో పట్టున్న పార్టీగా ఉన్న బీజేపీ బలంగా కన్పిస్తోంది. గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లను సాధించాలన్న లక్ష్యంతో ఉంది.మొత్తం 48 పార్లమెంటు స్థానాలున్న మహారాష్ట్రలో రెండు బలమైన కూటములను ఏర్పరచుకున్నాయి. భారతీయ జనతా పార్టీ తన చిరకాల మిత్రుడు శివసేనతో పొత్తు కుదుర్చుకుంది. భారతీయ జనతా పార్టీకి 25 స్థానాలు, శివసేనకు 23 స్థానాలను సీట్ల సర్దుబాటు జరిగింది. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మరాఠ పోరు

శివసేన బలంతో తమకు గతకంటే మెరుగైన స్థానాలు వస్తాయన్న అంచనాలో బీజేపీ ఉంది. ఫడ్నవిస్ ఐదేళ్ల పాలన కొంత పరవాలేదనిపించడం బీజేపీకి కలసి వచ్చే అంశం.బాగల్ కోట్ దాడులు, అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు బీజేపీకి కొంత మెరుగైన ఫలితాలు వస్తాయన్నది విశ్లేషకుల అంచనా. శివసేన పార్టీ బీజేపీ విమర్శల జోరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంత తగ్గించింది. అయితే రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్య ఫడ్నవిస్ ప్రభుత్వాన్ని కొంత ఇబ్బంది పెడుతోంది. ఇదే అదనుగా కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. నిజానికి కాంగ్రెస్ కు కూడా మహారాష్ట్ర కంచుకోట వంటిదే.1999 లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. 2014 వరకూ కాంగ్రెస్ దే అధికారం. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అధికారాన్ని కోల్పోయింది. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలకు కేవలం ఆరు సీట్లకు మాత్రమే పరిమితమయింది. ఈసారి శరద్ పవార్ సహకారంతో మరింత బలం పెంచుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. పశ్చిమ మహారాష్ట్రంలో శరద్ పవార్ తన సత్తా చాటడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద మహారాష్ట్రలో ఎక్కువ సీట్లను సాధించే లక్ష్యంతోనే రెండు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరి ఎవరు విజేతలో చూడాలి

No comments:

Post a Comment