నిజామాబాద్, మార్చి 26 (way2newstv.in)
నిజామాబాద్ లోకసభ స్థానానికి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. దేశంలో మొదటి విడితకు జరుగుతున్న నామినేషన్ ప్రక్రియలో అత్యధిక నామినేషన్స్ దాఖలు కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎర్రజొన్న, పసుపు రైతులకు మద్దతు ధర ఇవ్వాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని అన్నదాతలు భారీగా నామినేషన్లు వేశారు. చివరి రోజు నామినేషన్ దాఖలు సమయం ముగిసే నాటికి 245 రైతులు నామినేషన్లు వేశారు. దీంతో నిజామాబాద్ లోక్ సభకు చివరి రోజు 182 నామినేషన్లు దాఖలు కాగా... మొత్తం 242 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో రైతులు దాఖలు చేసినవే 200పైగా ఉన్నాయి. ఉపసంహరణ తర్వాత 96 మంది బరిలో ఉంటే ఏవీఎం లకు బదులుగా బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు నామినేషన్లు రూపంలో తమ నిరసన తెలియజేశారు. నిజామాబాద్ లోక్ సభ పరిధిలో ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కొరుట్ల నియోజకవర్గాలలో పాటు పెద్దపల్లి, ధర్మపురి ప్రాంత రైతులు సైతం నామినేషన్లు వేశారు.
భారీగా నామినేషన్లు
వీరితో పాటు బోధన్, మెట్పల్లి ప్రాంతం నుంచి చెరుకు రైతులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి విడత ఎన్నికల్లో దేశంలొనే నిజామాబాద్ లోక్ సభకు అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో రైతుల సమస్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు తమ ఆందోళన కొనసాతుందని రైతులు స్పష్టం చేశారు..నిజామాబాద్ లోక్ సభకు చివరి రోజు 182 నామినేషన్లు దాఖలు కాగా, మొత్తం నామినేషన్లు 245 దాఖలు చేశారు. మార్చి 20 న 7గురు, మార్చి 22 న 56 నామినేషన్లు దాఖలయ్యాయి. పసుపు, ఎర్రజొన్నకు కనీస మద్దతుధర కోసం, పసుపు బోర్డు ఏర్పాటు కోసం రైతులు గత 3నెలలుగా ఆందోళనలు చేపట్టారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో 35వేల ఎకరాల్లో సాగు చేస్తున్న మద్దతు ధర లేకపోవడంతో ఆందోళన చేపట్టారు. రొడ్డక్కి రైతులు నిరసనలు, ధర్నాలు చేపట్టిన మద్దతు ధర ప్రకటన కాకపోవడంతో దేశంలో చర్చ జరగాలని కోరుతూ రైతులు భారీగా నామినేషన్స్ వేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 200కు పైగా మంది రైతులు నామినేషన్స్ వేశారు. నిజామాబాద్ లోక్ సభా స్థానానికి టీఆరెస్ అభ్యర్థి గా ఎంపీ కవిత తిరిగి రెండోసారి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ తరపున మధుయాష్కీ, బీజేపీ తరపున ధర్మపురి అర్వింద్ పోటీలో ఉండగా 200మంది పసుపు, ఎర్రజొన్న రైతులు భారీగా నామినేషన్స్ దాఖలు చేశారు. దీనితో నిజామాబాద్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి.
No comments:
Post a Comment