Breaking News

09/03/2019

తెలంగాణ ఎన్నికల ఖర్చు 350 కోట్లు

హైద్రాబాద్, మార్చి 9, (way2newstv.in)
రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల నిర్వహణకు 350కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.శాసనసభ ఎన్నికల ఖర్చును సంభధిత రాష్ట్రాలు భరిస్తుండగా, లోక్ సభ ఎన్నికల ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించడం ఆనవాయితీగా వస్తోంది.శాసనసభ ఎన్నికల వ్యయాన్ని పరిగణలోనికి తీసుకోని లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు 350కోట్ల రూపాయలు అవసరం పడతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు కేంద్రానికి పంపించారు.లోకసభ ఎన్నికల నిర్వహణకు సంభందించిన అన్ని వ్యవహారాలను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పర్యవేక్షి స్తుంది .ప్రస్తుతం మన రాష్ట్రానికి సంభందించిన దస్త్రం ఈ మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉంది.రాష్ట్రంలో 17 లోక్ సభ ఎన్నికలకు సంభదించిన ఏర్పాట్లును ఏవిధంగా నిర్వహించాలనే దానిపై  కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ నెలలోనే మార్గదర్శకాలను జారీ చేసింది. దాని ప్రకారం ఎన్నికల నిర్వ్హణకు అవసరమైన ఏర్పాట్లును ఎన్నికల సంఘం అధికారులు ప్రారంభించారు. 


 తెలంగాణ ఎన్నికల ఖర్చు 350 కోట్లు

2019 సంవత్సరం జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారిని ఓటర్లుగా నమోదు చేయడం, ఓటర్ల కార్డుల తయారీకి పోలింగ్ బూతుల మరమ్మత్తు, అధికారులకు అవసరమైన శిక్షణ తదితర ఏర్పాట్లు ఇదివరకే ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంభందించిన వ్యయానికి కేంద్రం నుంచి ఇంకా అనుమతి రాలేదని తెలిసింది.అయితే లోక్ సభ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కార్యక్రమాలు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం పూర్తి చేయాల్సి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ముందస్తుగా 110కోట్ల రూపాయలను విడుదల చేసింది.ఈ మొత్తాన్ని కేంద్ర న్యాయమ ంత్రిత్వ శాఖ నుంచి వచ్చే మొత్తం నుంచి రాష్ట్రానికి చెల్లిస్తారు. ఈ నిధులనుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు 90 కోట్లు విడుదల చేయగా మిగతా 20 కోట్ల రూపాయలను రాష్ట్ర కార్యాలయం  నుంచి నిర్వహణకు ఉపయోగిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు ఇతర రాష్ట్రాలనుంచి వస్తున్నాయి.అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే వివిప్యాడ్లు రాష్ట్రానికి వస్తున్నాయి. సిటీకి చెల్లించాల్సిన మొత్తం రవాణా చార్జీలు, ఎన్నికల ఏర్పాట్లకు అవసరమైన ఇతర ఏర్పాట్లకు ఈ నిధులను విడుదల చేస్తున్నారు..రానున్న కొద్దీ రోజులలో లోక్ సభ ఎన్నికలకు సంభందించిన షెద్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉండటంతో ఎన్నికల కు సంభందించిన ఇతర ఏర్పాట్లు ను పూర్తి చేయటం, కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పర్యటన ,ఎన్నికల అధికారులు సిబ్బందికి శిక్షణ నిర్వహించాల్సి ఉంది. వీటిన్నింటికి అయ్యే వ్యయం ఈ మొత్తం నుంచే భరాయించాలని ఉన్నతాధికారి ఒకరు తెలియ చేశారు.

No comments:

Post a Comment