Breaking News

09/03/2019

జూబ్లీ చెక్‌పోస్టు నుంచి హైటెక్ సిటీ వరకు మాన్యువల్‌గా మెట్రో

హైద్రాబాద్, మార్చి 9, (way2newstv.in)
హైదరాబాద్ నగరవాసులు  ఎదురుచూస్తున్న అమీర్‌పేట మెట్రో మార్గానికి భద్రతా పరీక్షలు పూర్తయ్యాయి. రెండు వారాలపాటు కమిషనర్ ఆఫ్ మెట్రోరైలు సేఫ్టీ బృందం ఈ మార్గాన్ని  తనిఖీలు చేసింది. అనుమతికి కొన్ని షరతులు విధించింది. ఇప్పటికే మెట్రో వేగం తక్కువని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సీఎంఆర్‌ఎస్ సూచించిన షరతులతో నడిపితే తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉందని మెట్రో వర్గాలు భావిస్తున్నాయి.భద్రతకు సంబంధించి సీఎంఆర్‌ఎస్ అనుమానాలను నివృత్తి చేసేలా హైటెక్‌సిటీ వరకు ట్రయల్ రన్  చేశారు. 


జూబ్లీ చెక్‌పోస్టు నుంచి హైటెక్ సిటీ వరకు మాన్యువల్‌గా మెట్రో

సమస్యలు ఉత్పన్నం కాకుండా తీసుకునే చర్యలను మరోసారి సీఎంఆర్‌ఎస్‌కు వివరించి  షరతులు లేని అనుమతిని కోరే అవకాశం ఉందని సమాచారం. అమీర్‌పేట 10 కి.మీ. మార్గమే అయినా నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రణాళిక లోపంతో అత్యంత క్లిష్టంగా మారింది. హైటెక్ సిటీలో రివర్సల్ లేకుండానే ఈ మార్గాన్ని పూర్తి చేసింది.జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి హైటెక్ సిటీ వరకు వెళ్లిన ట్రాక్‌లో  వెనక్కి తిరిగి రావడం.. రైల్వేలో మాదిరి ట్విన్ సింగిల్ విధానంలో నడపాల్సి ఉంటుంది. అప్పుడు నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టువరకు సీబీటీసీ టెక్నాలజీలో ఆటోమేటిక్‌గా  జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి హైటెక్ సిటీ వరకు మాన్యువల్‌గా రైళ్లను నడపాలి. ఫలితంగా రైళ్లు ఇప్పుడు నడుపుతున్న మాదిరి ప్రతి 7 నిమిషాలకు ఒకటి నడపలేని పరిస్థితి ఉంటుంది. ఈ నేపధ్యంలో భధ్రతా అంశాలకు సంభంధించి మరోసారి తనిఖీలు జరిగే అవకాశం ఉందని  నిపుణులు అంటున్నారు. 

No comments:

Post a Comment