Breaking News

13/03/2019

23 ఏళ్ల తర్వాత మళ్లీ ఎంపీగా కొణతాల

విశాఖపట్టణం,మార్చి 13, (way2newstv.in)
ఎట్టకేలకు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరబోతున్నారు. అయిదేళ్ళ రాజకీయ‌ వనవాసానికి ఆయన ముగింపు పలకబోతున్నారు. పదేళ్ల పాటు అధికార రాజకీయాకు దూరంగా ఉన్న మాజీ మంత్రి తాజాగా వేస్తున్న ఈ అడుగులు ఎటు వైపు తీసుకెళ్తాయో చూడాలి. కొణతాల రామకృష్ణ కరడు కట్టిన కాంగ్రెస్ నాయకుడు. ఆయనది ముప్పయ్యేళ్ళ రాజకీయ జీవితం 1989లో తొలిసారిగా అనకాపల్లి నుంచి యువకుడిగా ఉంటూ పోటీ చేసి అప్పటి సీనియర్ టీడీపీ నేత పెతకంశెట్టి అప్పలనరసింహాన్ని కేవలం 9 ఓట్ల తేడాతో ఓడించి గిన్నీస్ రికార్డ్ సృష్టించారు. ఆ తరువాత 1991 ఎన్నికల్లో మరోమారు ఆయన్నే భారీ ఆధిక్యతతో ఓడించిన కొణతాల అయిదేళ్ల పాటు ఎంపీగా కొనసాగారు. 1996లో అప్పటి టీడీపీ మంత్రి అయ్యన్నపాత్రుడి చేతిలో పరాజయం పాలైన కొణతాల 2004లో అనకాపల్లి అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు.


23 ఏళ్ల తర్వాత మళ్లీ ఎంపీగా కొణతాల

ఆ తరువాత వైఎస్సార్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు.కొణతాల రామకృష్ణ ఇరవయి మూడేళ్ళ తరువాత ఇపుడు మళ్ళీ అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన 1996లో ఎంపీగా ఓడిన తరువాత మళ్ళీ ఆ వైపు చూడలేదు. ఇక ఈసారి కూడా అసెంబ్లీకి పోటీ చేసి మంత్రి కావాలనే ఆయన భావించారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఆయన్ని ఎంపీగానే పోటీకి పెట్టాలనుకుంటున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కొణతాల కోరిన అనకాపల్లి అసెంబ్లీ సీటు విషయంలో ఎంతో మంది పోటీగా ఉన్నారు. పైగా ఎంపీ కోసం పోటీకి మాత్రం ఎవరూ ముందుకు రావడంలేదు. దాంతో కొణతాల వంటి మాజీ మంత్రిని రంగంలోకి దింపితే పార్టీ ఇమేజ్, ఆయన ఇమేజ్ కలసి గెలుపు సాధ్యమవుతుందని బాబు భావిస్తున్నారు.అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సీటుకు ఇపుడు ఎసరు వచ్చేసింది. కొణతాలతో ఆయనకు బంధుత్వం ఉంది. ఇద్దరూ వియ్యంకులు. దాంతో ఒకే కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వరాదన్న పార్టీ సూత్రాన్ని చెప్పి మరీ పీలాకు ఝలక్ ఇవ్వబోతున్నారట. పీలాపై అనేక అవినీతీ ఆరోపణలు ఉండడం, విశాఖ భూ దందాల వివాదంలో ఆయన మీద సిట్ విచారించి కేసు నమోదు చేయడం వంటిని మైనస్ పాయింట్లుగా ఉన్నాయని అంటున్నారు. అంతే కాకుండా ఆయన పనితీరు పట్ల కూడా జనంలో వ్యతిరేకత ఉందని చెబుతున్నారు. ఇక కొణతాలకు ఎటూ టికెట్ ఇచ్చామని, పైగా పీలా తమ్ముడు శ్రీనివాసరావుకు గవర కార్పోరేషన్ చైర్మన్ పదవి కూడా ఇచ్చామని చెబుతూ ఆయన్ని తప్పిస్తారని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే కొణతాల కోరిన అసెంబ్లీ సీటు రాలేదు. ఆయన వియ్యంకుడికి సీటు పోయింది. అయినా రాజకీయాల్లో ఉండాలనుకుంటున్న కొణతాలకు ఇపుడు టీడీపీ తప్ప మరో ఆప్షన్ కూడా లేదు. అందుకే ఆయన పార్టీలో చేరుతున్నారని అనుచరులు అంటున్నారు.

No comments:

Post a Comment