Breaking News

05/02/2019

దవాఖానాలో నీటి కష్టాలు

నల్గొండ, ఫిబ్రవరి 5, (way2newstv.in)
నల్గొండలోని జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో రోగులు చికిత్స కోసం సర్కారు ఆసుపత్రులను ఆశ్రయిస్తే అక్కడా స్వచ్ఛమైన తాగు నీరు లభించడంలేదు. రోగుల వెంట వచ్చే వారు, వైద్యులు, సిబ్బంది తాగు నీటికి తంటాలు పడుతున్నారు. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో తాగునీటి కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. కొందరు ఇళ్ల నుంచి తెచ్చుకుంటున్నారు. మరికొందరేమో ఆసుపత్రుల ఎదుట దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ఆసుపత్రిలో తాగు నీటికి రోగులు.. వైద్యులు.. సిబ్బంది సగటున రోజుకు రూ.3వేల నుంచి రూ.5వేలకు పైగా ఖర్చుచేస్తున్నట్లు అంచనా. 



దవాఖానాలో నీటి కష్టాలు

రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం, ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు శుద్ధి చేసిన నీటిని అందించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో తాగేందుకు శుద్ధినీరు లభించడంలేదు. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరూ బయట నుంచి కొనుగోలు చేయాల్సింది. సందర్శకుల సంఖ్య రెట్టింపుగానే ఉంటుంది. వైద్యులు, కొందరు సిబ్బంది ఇళ్ల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. లోపలి రోగులు, వారి వెంట ఉండే సహాయకులను పరిగణలోకి తీసుకుని లెక్కగడితే రోజుకు రూ.మూడు వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. లీటర్‌కు రూ.2 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. నీటిశుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేసినా అది మూలనపడి సంవత్సరాలు గడుస్తున్నా మరమ్మతు చేయించడం లేదు. కొంతకాలం బాగానే పనిచేసినా నిర్వహణ లేక మరమ్మతులకు గురైతంది.

No comments:

Post a Comment