Breaking News

05/02/2019

ముందుకు సాగని మినీ ఇండస్ట్రియల్ పార్క్

అదిలాబాద్, ఫిబ్రవరి 5, (way2newstv.in)
ప్రభుత్వ నిర్లక్ష్యం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ఆశలపై నీళ్లు చల్లింది. అధికారంలోకి వచ్చీరాగానే మినీ ఇండస్ట్రీయల్‌ పార్కుల ఏర్పాటు చేస్తామనే చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. జిల్లాల వారీగా భూములు గుర్తించండని.. అధికారులను ఉక్కిరి బిక్కిరి చేసి ఇప్పుడు ఆ ఊసే లేకుండాపోయింది. దీంతో మినీ ఇండస్ట్రీయల్‌ పార్కుల ఏర్పాటుపైన నీలినీడలు కమ్ముకున్నాయి. పారిశ్రామిక వాడల ఏర్పాటుకు అవసరమయ్యే భూ సేకరణ దశ నుంచి బయటపడలేకపోతున్నారు.
నిరుద్యోగ యువతీ, యువకులు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం లఘు పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. అందుకు అవసరమైన భూముల తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ  ఆధ్వర్యంలో భూములు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే 2014లో అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 10,775 ఎకరాలు అనువైనదిగా గుర్తించారు. 


 ముందుకు సాగని మినీ ఇండస్ట్రియల్ పార్క్

రెవెన్యూ అధికారులు మాత్రం కేవలం 2వేల ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. రెవెన్యూ, టీఎస్‌ఐఐసీ అధికారుల మధ్యన సమన్వయం లేకపోవడంతో భూ సేకరణ ప్రక్రియ ఆరంభంలోనే ఆగిపోయింది. టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో భూములు కొనుగోలు చేసి వాటిని అభివృద్ధి చేయాల్సి ఉంది. విద్యుత్తు, రహదారులు వంటి సదుపాయాలను కల్పించాలి. కానీ.. అరకొరగా గుర్తించిన భూ సేకరణే ఇప్పటికీ పూర్తికాలేదు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మూడేళ్లుగా ఊరింపులు తప్పడం లేదు. టాటా వంటి బడా సంస్థ మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినా.. ప్రయోజనం లేకుండాపోయింది.ఆదిలాబాద్‌ జిల్లాలో బట్టిసావర్‌గాంలో సర్వేనెం.134లో 14ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు చేయడానికి ఔత్సాహికులు ఎక్కువగానే ఉన్నారు. డిమాండుకు తగినట్లు ఇంకా భూములు సేకరించాల్సి ఉంది. భూముల సేకరణలో జాప్యం కారణంగా ఔత్సాహిక పారిశ్రామి వేత్తలు నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లా నెన్నెల్‌ మండల కేంద్రంలో వెయ్యి ఎకరాలను పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం గుర్తించారు.  ఇక్కడ సోలార్‌ విద్యుత్తు ప్లాంటును ఏర్పాటు చేయడానికి టాటా సంస్థ ముందుకొచ్చింది. అయితే.. ఇక్కడ కూడా అటవీ, రెవెన్యూ శాఖల మధ్యన వివాదం కారణంగా ఇప్పటికీ ఈ భూముల విషయంలో స్పష్టతరాలేదు. దీంతో ఇక్కడ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు పక్రియ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. భూముల కేటాయింపు సరైన సమయానికి చేయకపోవడంతో ఔత్సాహిక పారిశ్రామిక సంస్థలు నిరాశతో ఉన్నాయి. నిర్మల్ జిల్లా సారంగాపూర్‌ మండలం ఆలూరులో 200 ఎకరాల భూమిని గుర్తించారు. కానీ ఈ భూములపైన ఇప్పటికీ స్పష్టత రాలేదు. దీంతో ఇక్కడ పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయాలని ఆశపడ్డ ఔత్సాహికుల ఆశలపైన నీళ్లు చల్లినట్లైంది. కుమురం భీం జిల్లా బెజ్జూర్‌ మండలం ఎల్కపల్లిలో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు 1050ఎకరాలు అనువైనదిగా గుర్తించారు. ఇక్కడ కూడా రెవెన్యూ, అటవీశాఖ అధికారుల మధ్య సమన్వయం లేకపోయింది. ఆ భూమి తమదంటే తమదంటూ రెవెన్యూ, అటవీశాఖ అధికారుల మధ్యన వివాదం కొనసాగుతూనే ఉంది.

No comments:

Post a Comment