హైద్రాబాద్, ఫిబ్రవరి 9,(way2newstv.in)
వెండితెర, బుల్లితెరలపై హంగామా చేస్తూ ప్రతీ ఇంటా సందడి చేసే నటీనటులు ఆత్మహత్యలు చేసుకోవటం జీర్ణించుకోలేక పోతున్నారు ప్రేక్షకులు. ప్రతీ రోజు సీరియల్స్‌లో కనిపిస్తూ, సరదాగా సినిమాకెళ్లినప్పుడు తమను హుషారెత్తించే నటుల జీవితాలు ఇలా అర్థాంతరంగా ముగిసిపోవడం అన్నివర్గాల ప్రేక్షకులకు కలచి వేస్తోంది. అయితే తెరపై ఓ వెలుగు వెలుగుతూ సాగిపోతున్న ఈ నటీనటులు ఆత్మహత్యలు చేసుకోవటం వెనుక కారణాలేమిటని చూస్తే.. ఎక్కువగా ఆర్ధిక ఇబ్బందులు లేదా ప్రేమ వ్యవహారాలు కనిపిస్తున్నాయి. వీరి జీవితం కూడా ఓ సాధారణ మనిషి జీవితమే కదా! వారికీ కష్టసుఖాలు ఉంటాయి. కానీ జనం మాత్రం నటీనటులను చూసి వీరికేంటి? అద్దాల మెడలు, ఎన్నో సదుపాయాలు,
అర్ధాంతరంగా ముగిసిపోతున్న నటుల జీవితాలు
కలర్‌ఫుల్ జీవితం అనుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో జరుగుతున్న నటుల ఆత్మహత్యలు తాము కూడా జీవితంలో ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నాము అనే విషయాలను సాధారణ జనానికి తెలుపుతున్నాయి. కాగా ఎంతో కష్టపడి నటిగా గుర్తింపు వచ్చాక ఇలా తమ జీవితాలకు తామే ఫుల్‌స్టాప్ పెట్టుకోవటం మాత్రం సరైన నిర్ణయం కాదని అంటున్నారు నిపుణులు. హీరోయిన్ ప్రత్యూష ఆత్మహత్య టాలీవుడ్‌లో పెద్ద సంచలనమే అయింది. ఆ తర్వాత స్టార్ హీరో స్టేటస్ తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఆత్మహత్య అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంత మంచి పేరున్న నటీనటులు ఆత్మహత్య చేసుకోవటమేంటని విస్తుపోయారంతా. అయితే దీని వెనుక ఆర్థిక, మానసిక కారణాలున్నాయంటూ ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా టీవీ యాంకర్స్, బుల్లితెర నటులు కూడా ఆత్మహత్యలు చేసుకోవటం చూసి విషాదంలో మునిగిపోతోంది గ్లామర్ ఇండస్ట్రీ. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో వర్ధమాన సినీ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకోవటం అందరినీ విషాదంలో ముంచెత్తింది. సాయి అపార్ట్‌మెంట్‌లోని తన నివాసంలో ఝాన్సీ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమెకు సూర్య అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారముందని, అదే ఈ ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే నటీనటుల ఈ వరుస ఆత్మహత్యలు సినీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకొంటూ.. తమకు భరోసాగా ఉండేవారే కరువయ్యారని అంటున్నారు కొందరు నటీనటులు.
No comments:
Post a Comment