Breaking News

05/02/2019

ముంపు గ్రామాలు సర్వేకు సహకరించాలి

సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్  
సిద్ధిపేట, ఫిబ్రవరి 05: (way2newstv.in)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపునకు గురయ్యే గ్రామాలైన వేములఘాట్, ఏటిగడ్డకిష్టాపూర్, బ్రాహ్మణ బంజరుపల్లి, రాంపూర్ ప్రజలు బుధవారం రోజున సర్వేకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సోమవారం ఓ ప్రకటనలో కోరారు. 


ముంపు గ్రామాలు సర్వేకు సహకరించాలి

ఆయా గ్రామాలలో సామాజిక, ఆర్ధిక స్థితిగతులపై సర్వే చేపట్టనున్నట్లు వివరిస్తూ  బుధవారం రోజున ఉదయం నుంచి సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు  ఆయా గ్రామాలలోని ప్రజలు వారి నివాసాల యందు ఉండి ఇట్టి సర్వేకు వచ్చిన అధికారులు, అధికారిక సిబ్బందికి సంపూర్ణంగా సహకరించి, మీయొక్క పూర్తి  సమాచారాన్ని నమోదు చేసుకోవాలని సూచిస్తూ ఇట్టి సర్వేను విజయవంతం చేయాలని ఆ ప్రకటనలో కోరారు. 

No comments:

Post a Comment