Breaking News

25/02/2019

పప్పుకూడు కోసం అప్పు చేయం

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (way2newstv.in)
ఎఫ్ ఆర్ బిఎంకు లోబడే అప్పులు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. తాము అప్పు చేసి పప్పు కూడు తినడం లేదని ఆయన అన్నారు. సోమవారం నాడు శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు కెసిఆర్ సమాధానమిచ్చారు. బడ్జెట్పై కాంగ్రెస్కు అవగాహన లేదన్నారు. పరిపాలనలో కూడా పెను మార్పులు వస్తాయని కేసీఆర్ స్పష్టం చేశారు. పరిమిత సమయానికి ఖర్చులు చూసుకోవడమే.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని అన్నారు. అంతిమంగా రాష్ట్ర ప్రజలకు మేలు చేయడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తాము చేసే అప్పు నీటి కోసమేనని ఆయన చెప్పారు.

 
పప్పుకూడు కోసం అప్పు చేయం

 అందరికీ రక్షిత తాగు నీరు ఇవ్వడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రతిపక్ష నేతలు అసంబద్ధమైన వాదనలు తీసుకువచ్చారు. సభను తప్పుదోవ పట్టించే సత్యదూరమైన విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఓటాన్ అకౌంట్ ఆర్నేళ్లు? మూడ్నేళ్లు? ఎందుకు అని ప్రశ్నించారు.  పోడుభూముల సమస్యలను స్వయంగా పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. నాలుగైదు నెలల్లో నిరుద్యోగ భృతి అమలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేశామన్నారు. కరెంట్ కష్టాలను అధిగమించామని, 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఓటాన్ అకౌంట్కు నిర్వచనం లేదు. పరిమిత సమయానికి ఖర్చులు చూసుకోవడమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వ విధానాలను బట్టి రాష్ట్ర అవసరాలను మార్చుకోవాల్సి ఉంటుందని అయన అన్నారు. బడ్జెట్ అన్న తర్వాత సవరణలు ఉంటాయని, వాటిని తప్పుగా చిత్రీకరించడం సరికాదని అన్నారు.  టీఆర్ఎస్ విధానాలు, పనులు తప్పయితే ప్రజలు రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించేవారు కాదని అయన గుర్తు చేసారు.

No comments:

Post a Comment