కర్నూలు, ఫిబ్రవరి 27(way2newstv.in)
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గ పరిధిలోని అహోబిలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు.
అహోబిలంలో పవన్ కళ్యాణ్
అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా తో మాట్లాడుతూ అహోబిలం తిరుపతి మాదిరిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని అహోబిలం పుణ్యక్షేత్రం పురాణాలు చెప్పిన స్థలమని లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని, తిరుపతి పుణ్యక్షేత్రం అభివృద్ధిలాగా అహోబిలం పుణ్యక్షేత్రన్నీ కూడా అభివృద్ధి చేస్తే చాలామంది భక్తులు స్వామిని దర్శించుకోవటానికి అవకాశముంటుందని అన్ని పుణ్యక్షేత్రాల్లాగా రాజాద్వారం కావాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేసారు.
No comments:
Post a Comment