Breaking News

27/02/2019

కూలిపోయింది భారత్‌ మిగ్‌ 21 బైసన్‌ యుద్ధవిమానం

న్యూఢిల్లీ ఫిబ్రవరి 27 (way2newstv.in
పాకిస్థాన్‌లో భారత్‌కు చెందిన మిగ్‌ 21 బైసన్‌ యుద్ధవిమానం కూలినట్లు భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ ధ్రువీకరించారు.  వింగ్‌ కమాండర్‌ ఒకరు పాక్‌ అదుపులో ఉన్నారని పాక్‌ చెప్పిందని తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. భారత్‌ చేపట్టిన వాయుసేన దాడికి ప్రతిగా భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ బుదవారం ఉదయం దాడికి పాల్పడిందని వివరించారు. 


కూలిపోయింది భారత్‌ మిగ్‌ 21 బైసన్‌ యుద్ధవిమానం

పాక్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టామని తెలిపారు. దాడులను తిప్పికొట్టేందుకు భారత దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలో మిగ్‌ 21 బైసన్‌ విమానం కూలిపోయిందని, కమాండర్‌ గల్లంతయ్యాడని తెలిపారు.బుధవారం ఉదయం పాక్‌ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. వాటిని అడ్డుకొనే క్రమంలో శ్రీనగర్‌లో ఉన్న క్విక్‌ రియాక్షన్‌  టీమ్‌లోని మిగ్‌లు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో భారత్‌కు చెందిన మిగ్‌ 21 బైసన్‌ పాక్‌ భూభాగంలోకి ప్రవేశించింది. ఆ విమానంలో ఉదయం వెళ్లిన పైలట్‌ అభినందన్‌ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఇప్పటికే అభినందన్‌ తమకు చిక్కినట్లు పాకిస్థాన్‌ ఒక వీడియో కూడా విడుదల చేసింది.

No comments:

Post a Comment