ఖమ్మం, ఫిబ్రవరి 14 (way2newstv.in)
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల సంగమేశ్వరస్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. ఖమ్మంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలి
పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యం కల్పించాలని, స్నానఘట్టాలు ఏర్పాటు, పోలీసు బందోబస్తు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, వైద్య శిబిరాలు, నిరంతర విద్యుత్తు సరఫరా వంటి అంశాలపై ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. జాతరకు ముందుగానే ఆయా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసేయాలని ఆదేశించారు. జాతరకు ఆర్టీసీ బస్సులు నడపాలని చెప్పారు. డీపీవో శ్రీనివాసరెడ్డి, ఐబీ డీఈ అర్జున్, ఆర్డబ్ల్యుఎస్ డీఈ శైలజ, దేవాదాయ శాఖ ఏసీ సమత, ఖమ్మం రూరల్ తహసీల్దార్ అశోకచక్రవర్తి, ఆలయ ఈవో ప్రసాద్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment