Breaking News

14/02/2019

కదిరిలో కూరగాయల మార్కెట్ రూపు రేఖలు మార్చేస్తాం

కదిరి, ఫిబ్రవరి 14 (way2newstv.in
కదిరి పట్టణంలోని కూరగాయల మార్కెట్ రూపు రేఖలు మార్చేస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి డా. పెడబల్లి వెంకట సిద్దారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన "గుడ్ మార్నింగ్ కదిరి" కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానిక కూరగాయల మార్కెట్ లో పర్యటించారు. అక్కడ వ్యాపారులు, రైతులు, వినియోగదారులు ఆయనకు బ్రహ్మ రథం పట్టారు. 


కదిరిలో కూరగాయల మార్కెట్ రూపు రేఖలు మార్చేస్తాం

ప్రతి చోట ఆయన కు పూల మాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. యువకులు పెద్ద ఎత్తున బాణ సంచా పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మార్కెట్ లో మీడియా తో మాట్లాడారు.  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రాగానే కదిరి కూరగాయల మార్కెట్ లో వ్యాపారులు, కొనుగోలు దారులతో పాటు రైతులకు తగిన సౌకర్యాలు కల్పిస్తాం.  మూడు అంతస్థుల భవనం నిర్మించి కూరగాయలతో పాటు అన్ని రకాల నిత్యావసర వస్తువులు మార్కెట్ లో లభించే విధంగా చర్యలు తీసుకుంటాం.  రైతులు, వ్యాపారులు మార్కెట్ లో విశ్రాంతి తీసుకోవడానికి కూడా వసతులు కల్పిస్తామని అన్నారు.  మార్కెట్ లోనే తక్కువ ధర కు భోజనం లభించే విధంగా కాంటీన్ కూడా ఏర్పాటు చేస్తాం.  ప్రతి రైతుకు పెట్టుబడి కోసం ఏటా రూ.12,500 చొప్పున మొత్తం రూ.50 వేలు ఉచితం గా అందజేస్తామని అన్నారు.  ప్రతి డ్వాక్రా మహిళకు రూ75 వేలు ఉచితంగా ఇస్తాం.  ప్రతి ఇంట్లో అర్హులైన వారందరికీ నెలకు రూ3 వేలు పింఛన్ ఇస్తాం.  పిల్లలను బడికి పంపినందుకు ఆ పిల్లల తల్లి ఖాతాలో రూ 15 వేలు జమ చేస్తాం.  ఉన్నత చదువులు చదివిస్తే ఆ పిల్లల ఫీజు మొత్తం జగనన్నే భరిస్తాడని అన్నారు.  దేశంలో ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆ వైద్యం ఖర్చు మొత్తం జగన్ మోహన్ రెడ్డి భరిస్తాడు. జగనన్న పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారు.  అందుకే జగనన్న కు ఒక్క అవకాశం ఇవ్వండని ప్రజల్ని పదే పదే కోరుకుంటున్నానని అన్నారు.

No comments:

Post a Comment