కర్నూలు , ఫిబ్రవరి, 14 (way2newstv.in):
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య ఆడుగుజడల్లో మనమందరం పయనించాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం దామోదరం సంజీవయ్య 98 వ జయంతిని పురష్కరించుకొన్నికలెక్టర్ కార్యాలయంలో ఉన్న వారి చిత్రపటానికి జడ్పీ ఛైర్మన్ మల్లెల రాజశెఖర్ తో కలసి పుష్పమాల వేసి ఘనంగా నివాళు ఆర్పించారు.
దామోదరం సంజీవయ్యలను ఆదర్శంగా తీసుకోవాలి
ఈ సందర్బంగా హజరైన విద్యర్దులను ఉదేశించి కలెక్టర్ మాట్లాడుతూ దామెదర్ సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14 న మన కర్నూలు జిల్లాలోని పెద్ద పాడు గ్రామంలో ముసలయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించారన్నారు. సామాన్య నిరుపేద దళిత కుటుంబంలో జన్మించినప్పటికి పట్టుదల తో విద్యనభ్యసించి దేశం గర్వించే స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దామోదరం సంజీవయ్యను దర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లి దండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ వో వెంకటేశం, ఇతర అధికారులు, దళిత సంఘల నేతలు, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment