కర్నూలు,ఫిబ్రవరి 5, (way2newstv.in)
మంత్రాలయంలో ఎక్కడపడితే అక్కడ అక్రమ ఇసుక డంప్‌లు దర్శనమిస్తుంటాయి. కాని సంబంధిత రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు చోద్యం చూస్తున్నారు. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లాలో అనుమతులు లేని చోటు నుండి అక్రమ ఇసుకను తరిలించి డంప్‌లు ఏర్పాటు చేస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా, అందుకు విరుద్ధంగా మంత్రాలయంలో అధికారులు పట్టించుకోకపోవడం, మరోపక్క వారి అండతోనే ఎక్కడ పడితే అక్కడ అధికంగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ డంపులు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
తుంగభద్ర నుంచి ఇసుక తవ్వేస్తున్నారు...
అలాగే ఓ ప్రజానాయుకుడు రెవెన్యూ, మండల పరిషత్, పోలీసు అధికారులను సైతం తనకు అనుగుణంగా చేసుకున్నాడని, అతని అనుచరులు ఎమ్మిగనూరు, ఆదోని తదితర పట్టణాలకు అక్రమ ఇసుక తరిలించి అధిక మొత్తంలో డబ్బులు దండుకుని సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అనుమతులు లేని చోటు నుండి ఇసుకను తరలించి, చెట్నేపల్లి, మంత్రాలయంలోని మాధవరం రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల మైదానం, ఎమ్మిగనూరు రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల వద్ద, సుజరుూంద్రనగర్‌లో ఓ ప్రైవేటు పాఠశాలకు సమీపంలోని ముళ్లపొదల్లో ఇసుక డంపులను నిల్వచేశారు. అయితే ఈ ఇసుక డంపులన్నీ మరో ప్రజానాయకుడి ముఖ్య అనుచరులవేనని సమాచారం. మంత్రాలయంలోని తుంగభద్ర నదినుంచి రాత్రివేళ, వేకువ జామున ఇసుకను తరిలిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు మామూళ్లు ముట్టచెప్పడంతోనే నోరు మెదపలేదని, చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అలాగే అక్రమ ఇసుక దందాకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన త్రిమెన్ కమిటీ సభ్యులు పోలీసులకు ఏమాత్రం సహకరించలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈవిషయంపై సీఐ రామును వివరణ కోరగా మంత్రాలయం నదిలో నుంచి ప్రభుత్వ మరుగుదొడ్లు నిర్మాణ పనుల ముసుగులో వందల ట్రాక్టర్లు ఇసుకను తరిలిస్తున్నారని, అయితే తుంగభద్ర నదిలోకి వెళ్లి ఇసుక ట్రాక్టర్లను పట్టుకునే అనుమతులు మాకు లేవని, రెవెన్యూ, మండల పరిపత్, పంచాయతీ అధికారులు సహకరిస్తే అక్రమ ఇసుకదందాను అరికట్టగలమని తెలిపారు.
No comments:
Post a Comment