Breaking News

19/02/2019

పౌరసరఫరాల సంస్థ ఆర్థికంగా బలోపేతానికి బిజినెస్‌ వింగ్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (way2newstv.in) 
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులతో పాటు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు వంటి రైతు సంక్షేమ చర్యలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి ప్రజా పంపిణీ అవసరాలకు మించి ధాన్యం దిగుబడి అవుతోంది. ఈ నేపథ్యంలో రైతులకు కనీస మద్దతు ధర అందించడంతో పాటు పౌరసరఫరాల సంస్థ ఆదాయాన్ని పెంచడానికి బిజినెస్‌ వింగ్‌ను ఏర్పాటు చేయబోతోంది. గత ఏడాది ఖరీఫ్‌లో పౌరసరఫరాల సంస్థ 4.5 లక్షల మంది రైతుల నుండి 18.37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ ఏడాది ఖరీఫ్‌లో 3297 కొనుగోలు కేంద్రాల ద్వారా 8.09 లక్షల మంది రైతుల నుండి 40.72 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది.


పౌరసరఫరాల సంస్థ ఆర్థికంగా బలోపేతానికి బిజినెస్‌ వింగ్‌

ప్రజాపంపిణీ అవసరాలకు మించి రాష్ట్రంలో అదనంగా ఉత్పత్తి అయిన ధాన్యాన్ని, బియ్యాన్ని ఎలా వాడుకోవాలి, ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతికి ఉన్న అవకాశాలు, రైతులకు కనీస మద్దతు ధర, పౌరసరఫరాల సంస్థ ఆదాయం పెంపుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఇందుకు అవసరమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను రూపొందించుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు పలు సలహాలు, సూచనలు చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల ఆహార అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగాఉత్పత్తులపై దృష్టి సారించాలి. ఏయే ప్రాంతంలో ఏ రకమైన పంట పండుతుంది, ఏ రకమైన పంటలను ప్రోత్సహించాల్సి అవసరం ఉంది వంటి అంశాలను పరిశీలించాలి.సహజ పద్ధతుల్లో, ఎరువులు లేని వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. దీన్ని ప్రజలు భారీగా కోరుకుంటున్నారు.నిజామాబాద్‌ జిల్లాలో పసుపు, ఖమ్మం జిల్లాలో మిర్చి, వికారాబాద్‌ జిల్లాల్లో కందిపప్పు రైతులు అధికంగా పండిస్తారు. ఇలాంటి పంటలను పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసి తెలంగాణ బ్రాండ్‌ పేరుతో ప్రజలకు అందించాలి. ప్రస్తుతం చిరు ధాన్యాలకు ప్రజల నుంచి భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతంలో చిరుధాన్యాలను ఎక్కువగా పండిస్తున్నారు. ఇటువంటి పంటలను ప్రభుత్వం ప్రోత్సహించడమే కాకుండా వాటిని సేకరించి పౌరసరఫరాల సంస్థ ద్వారా మార్కెట్‌లో విక్రయించాలి. జహీరాబాద్‌లో చిరు ధాన్యాల పంటల సాగుపై రైతులను దక్కన్‌ సోసైటీ ప్రోత్సహిస్తోంది. కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ ఈ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించారు.రాష్ట్రంలో భారీగా ధాన్యం దిగుబడి అవుతోంది. ఈ నేపథ్యంలో నాణ్యమైన బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థే స్వయంగా ఉత్పత్తి చేసి రేషన్‌ షాపులు, రైతు బజార్లు వంటి ప్రాంతాలలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి విక్రయించాలి.తెలంగాణ బ్రాండ్‌ పేరుతో పౌరసరఫరాల సంస్థ ఉత్పత్తి చేసే సరుకుల్లో ఎలాంటి కల్తీ లేకుండా క్వాలిటీ, క్వాంటిటీ ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తుందని నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం. గతంలో పౌరసరఫరాల శాఖ వివిధ సరుకులను రేషన్‌ షాపుల ద్వారా తక్కువ ధరకు రేషన్‌ కార్డుదారులకు అందించింది. దాన్ని ఎందుకు కొనసాగించలేకపోయాం, ఎందుకు విఫలం అయింది అనే అంశాలను పరిశీలించాలి.సరైన మార్కెటింగ్‌ విధానాన్ని కూడా రూపొందించుకోవాలి.బియ్యం ఉప ఉత్పత్తులపై దృష్టి సారించాలి.ముందుగా మార్కెట్‌లో ఏ రకమైన వస్తువులకు, ఆహారానికి డిమాండ్‌ ఉంది అనే అంశాన్ని పరిశీలించాలి.తెలంగాణలోని 33 జిల్లాల్లో కలెక్టర్‌ కార్యాలయాలకు సమీపంలో పెట్రోల్‌ బంక్‌లు ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలి.పౌరసరఫరాల సంస్థ గోదాములు ఉన్న ప్రాంతంలో వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే అంశాలను కూడా పరిశీలించాలి. 

No comments:

Post a Comment