సిద్దిపేట, ఫిబ్రవరి 15(way2newstv.in)
గురువారం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అవంతీపుర వద్ద సి ఆర్ పి ఎఫ్ జవాన్లపై జరిగిన దాడిని నిరసిస్తూ సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద భజరంగ్ దళ్, బిజెవై ఎం, ఏబీవీపీ, హిందూ సంఘాలు తీవ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేసాయి. భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని జైషే మహమ్మద్ తీవ్రవాదులు చేసిన దాడిని పిరికిపంద చర్యగా బజరంగ్ దళ్ భావిస్తుందని వారన్నారు.
ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం
అమరులైన జవానుల ఆత్మకు శాంతి కలగాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎబివిపి బజరంగ్ దళ్ హిందూ సంఘాల కార్యకర్తలు అమరవీరులకు జోహార్లు తెలిపారు. అమరుల త్యాగాలను భారత జాతి నివాళులర్పిస్తున్నది. ప్రభుత్వం మరోకసారి సర్జికల్ స్పైక్ చేసి పాకిస్తాన్ కి భారత సైన్యం పంజా రుచి చూపాల్సిన అవసరముందని బజరంగ్ దళ్ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో .ప్రశాంత్ ,సురేష్ ,ఏబీవీపీ నాయకులు, నేహాల్ గౌడ్ ,రాహుల్ గౌడ్, హరీష్ ,రమేష్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ , సప్తగిరి ,రాజు, బిజెవైఎం నాయకులు కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు...
No comments:
Post a Comment