Breaking News

16/02/2019

రాహుల్ ప్రధాని కావడం ఖాయం

కర్నూలు, ఫిబ్రవరి 16, (way2newstv.in
80 రోజుల్లో మోడీ ప్రధానిగా ఓడిపోవడం, రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడుతూ మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారన్నారు. 


 రాహుల్ ప్రధాని కావడం ఖాయం

మోడీ పాలనను అంతం చేయాలని ప్రజలు సిద్ధమయ్యారన్నారు. చంద్రబాబు నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం బీజేపీతో సంసారం చేసి ఇప్పుడు మోడీపై యుద్ధం అంటున్నారని అన్నారు.  ముఖ్యమంత్రి జాతీయ స్థాయిలో పార్టీలను కలుపుతున్నామని ప్రచారం చేస్తున్నారని, రాహుల్ గాంధీ ప్రధాని అయిన తరువాత మొదటి సంతకం హోదా పైనే అన్నారు.  చంద్రబాబు అన్ని రంగాల్లో విఫలమయ్యారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని బైరెడ్డి విమర్శించారు. 

No comments:

Post a Comment