Breaking News

02/02/2019

అప్రమత్తంగా వుండండి

అమరావతి, ఫిబ్రవరి 2, (way2newstv.in) 
టిడిపి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ శుక్రవారం  శాసనసభ చరిత్రలో నిలిచిపోయే రోజు. వందలాది ఎమ్మెల్యేలు బ్లాక్ షర్ట్స్ ఎప్పుడూ జరగలేదు.  ఢిల్లీలో టిడిపి ఎంపిలు నల్లచొక్కాలతో ధర్నా చేశారు. రాష్ట్రంలో జెఏసి బంద్ విజయవంతమైంది. అన్యాయాన్ని నిగ్గదీసేందుకే ఈ తీవ్ర నిరసనలు. ఒక్క క్షణం కూడా ఏమరపాటుగా ఉండరాదని అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం విస్మరించరాదు. నిరసనల్లో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు. చివరి బడ్జెట్ లో కూడా బిజెపి ఏపికి ద్రోహమే చేసింది. ఆంధ్రప్రదేశ్ మాటే ఈ బడ్జెట్ లో ప్రస్తావన లేదు. రోజుకు రూ.16 ఇస్తే రైతులకు ఒరిగేదేమీ లేదని అన్నారు.


అప్రమత్తంగా వుండండి

ఐదు ఎకరాల భూమి ఉంటే రూ.500 భిక్ష వేస్తారా అని ప్రశ్నించారు. కేంద్రబడ్జెట్ పేదలపై ఏమాత్రం ప్రభావం చూపలేదు.సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. ఈబిసీ రిజర్వేషన్ల ఆదాయ పరిమితి రూ.8లక్షలు. ఆదాయపన్నుకు మాత్రం రూ.5లక్షలు పెట్టారని అన్నారు. ఇటువంటి విరుద్దతలు అనేకం ఉన్నాయి. నరేగాలో రాష్ట్రాన్నే అప్పు తెచ్చుకోమన్నారు. కేంద్రం ఇప్పటికే నరేగా బకాయిలు భారీగా చెల్లించాలి. బడ్జెట్ లో నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయలేదని అన్నారు. దేశంలో నిరుద్యోగంపై చైనా కూడా హెచ్చరించింది. మన రాష్ట్రంలోనే 14లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఒక్క ‘కియా’ లోనే వేలాదిమందికి ఉద్యోగాలు.  ఆటోమొబైల్, ఐటి,ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తెచ్చాం. ఎంఎస్ ఎంఈ పార్కులలో పెద్దఎత్తున ఉపాధి కలుగుతోంది. బిజెపి వైఫల్యం వల్లే దేశంలో నిరుద్యోగం. 
ఆఖరి బడ్జెట్ లో కూడా నిరాశ పరిచారు. ఈ 5ఏళ్ల మోది పాలన ఘోర వైఫల్యం. దేశాన్ని పెద్ద సంక్షోభంలోకి బిజెపి నెట్టింది. పేదల జీవితాల్లో ‘‘మరో సంక్రాంతి’’ పించన్ల పండుగ. 
ఈ 3రోజులు పెన్షన్ల పంపిణీలో అందరూ పాల్గొనాలి. పించన్ల పండుగలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి.  54లక్షల మంది పించన్లకు రూ.14వేల కోట్లు. 94లక్షల మహిళలకు రూ.10వేల కోట్ల పసుపు కుంకుమ. కోటి 48లక్షల మందితో మమేకం అయ్యే పండుగ ఇది. పించన్లు అనగానే తెలుగుదేశం పార్టీ గుర్తురావాలి. ‘పసుపు కుంకుమ‘ అనగానే తెలుగుదేశం గుర్తురావాలి. నాయకత్వలోపాలను అధిగమించాలి.  సరైన దృష్టి పెడితే ప్రతిగ్రామం టిడిపికి కంచుకోటే నని చంద్రబాబు అన్నారు.

No comments:

Post a Comment