Breaking News

23/02/2019

కాంగ్రెస్ తో కేటీఆర్ చర్చలు

హైదరాబాద్, ఫిబ్రవరి 23, (way2newstv.in)
తెలంగాణ శాసన సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవంగా పూర్తి చేసేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)  ప్రతిపక్షాలతో చర్చలు మొదలుపెట్టారు. ఈ పదవి కోసం టీఆర్ఎస్ మాజీ మంత్రి పద్మారావు గౌడ్ పేరును ఖరారు చేసింది. దీంతో పద్మారావును ఏకగ్రీవం చేసేందుకు రంగంలోకి దిగిన కేటీఆర్ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నాయకులతో  శనివారం భేటీ అయ్యారు. 


 కాంగ్రెస్ తో కేటీఆర్ చర్చలు

డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సహకరించాల్సిందిగా కోరారు. ఈ భేటీ మధ్యలో పద్మారావు కూడా వచ్చి వెళ్లారు.  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి పార్టీ నిర్ణయాన్ని చెబుతామని భట్టి విక్రమార్క చెప్పారు. తరువాత  ఉత్తమ్ కూడా భట్టి కార్యాయలయానికి చేరుకున్నారు.. ముగ్గురు నేతలు ఎన్నిక అంశంపై కలిసి చర్చించారు. తమ నిర్ణయం తర్వాత చెబుతామని మల్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం.  మరోవైపు శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి పద్మారావుగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు.  సోమవారం జరగనున్న ఈ ఎన్నిక లో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా అయ్యేందుకు ఇప్పటికే ఎంఐఎ, బీజేపీ ఆమోదం తెలిపాయి. 

No comments:

Post a Comment