ఆర్ధిక శాఖ కార్యదర్శిని కలిసిన ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్ ఫిబ్రవరి 6 (way2newstv.in)
రాష్ట్రంలోని 2245 ఎస్సి,ఎస్టి,బిసి,హాస్టళ్ళలో నివసించే 2.92 లక్షల మంది విద్యార్థుల భోజన ఖర్చులను గత 7 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడంలేదు. బడ్జెట్ విడుదల చేయడంలేదు. నెల, నెల సక్రమంగా విడుదల చేయవలిసిన బడ్జెట్ ను 7 నెలలుగా విడుదల చేయకపోతే హాస్టల్ విద్యార్థులకు భోజనాలు ఎలా పెడుతారని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సచివాలయంలో ఆర్ధిక శాఖ సెక్రెటరిని, బి.సి సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీని కలిసి వెంటనే బడ్జెట్ విడుదల చేయాలనీ కోరడం జరిగింది. హాస్టల్ వార్డెన్లు వడ్డిలకు అప్పులు తెచ్చి హాస్టళ్ళు నడిపిస్తున్నారు. లక్షల రూ. ఆప్పులు పెరుగడం మూలంగా హాస్టళ్ళు నడుపడం కష్టంగా మారింది.
ఎస్సి,ఎస్టి,బిసి హాస్టళ్ళకు బడ్జెట్ ను వెంటనే మంజూరు చేయండి
బిల్లులు చెల్లించని కారణంగా వ్యాపారస్థులు హాస్టల్స్ కి సరుకులు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు.చేసిన బకాయిలు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు. వెంటనే బడ్జెట్ విడుదల చేయకపోతే హాస్టళ్ళు మూసివేసే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.అప్పులు తీర్చలేక వార్డెన్లు ఇబ్బందులకు గురవుతున్నారు. హాస్టళ్ళలో 1178 వార్డెన్ పోస్టులు, 1600 వర్కర్ పోస్టులు ఖాళీగా ఉన్నవి. గత ఐదు సంవత్సరాలుగా ఈ పోస్టులు భర్తీ చేయకపోవడంతో హాస్టళ్ళ పాలన అస్త- వ్యస్తంగా తయారైంది. వర్కర్స్ లేక సమయానికి భోజనాలు తయారు కాక విద్యార్థులు సకాలంలో కాలేజీలకు వెళ్ళలేక పోతున్నారు. వార్డెన్ల పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీగా ఉండడం తో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఒక్కొక్క వార్డెన్ మూడు – నాలుగు హాస్టళ్లకు ఇంచార్జ్ గా ఉంటున్నారు. హాస్టళ్ళ పాలన అస్త – వ్యస్తంగా తయారైంది. వెంటనే వార్డెన్ పోస్టులు – వర్కర్ పోస్టులు భర్తీ చేయాలనీ కోరారు. హాస్టళ్ళ కరెంటు బిల్లుల బకాయిలు గత 12 నెలలుగా చెల్లించడం లేదు. రూ. 8 కోట్లు బకాయిలు పేరుక పోయినవి. విద్యుత్ శాఖ అధికారులు పదే,పదే హాస్టళ్లకు కరెంట్ కట్ చేస్తున్నారు. ఒక వైపు విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. కరెంట్ కట్ చేస్తే విద్యార్థులు ఎలా చదువుకుంటారు. ఒక రోజు కరెంట్ లేకపోతే విద్యార్థులకు పంపులు నడువక వాటర్ సప్లై లేక భోజనాలు పెట్టె పరిస్థితి ఉండదు. ప్రైవేటు భవనాలలో ఉన్న హాస్టళ్ళ అద్దె బడ్జెట్ కుడా రావటంలేదు. లక్షల రూ. బకాయిలు ఉన్నాయి. ఇంటి యజమానులు వేదిస్తున్నారు. కొన్ని హాస్టళ్ళ అద్దె భవనాలు చాల ఇరుకుగా ఉన్నవి. ఒక్కొక్క రూములో 6 మంది ఉండవలిసిన చోట 20 నుంచి 30 మందితో కిక్కిరిసిఉన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువు దెబ్బతింటున్నాయి. హాస్టల్ విద్యార్థులకు గత 6 నెలల నుంచి కాస్మోటిక్ చార్జీలు చెల్లించడం లేదు. సబ్బు, నూనెల పైసలు చెల్లించక పోవడంతో విద్యార్థులు చాల ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలని కోరారు. హాస్టల్ సమస్యలపై ముఖ్యమంత్రి శ్రద్ధతీసుకొని పరిష్కరించాలని కోరారు.
No comments:
Post a Comment