విజయవాడ, ఫిబ్రవరి 7, (way2newstv.in)
కృష్ణాతీరంలోని సీతానగరాన విజయకీలాద్రి పర్వతంపై కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 10 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. ఆమేరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీత్రిదండి చిన్న జీయర్స్వామి దివ్యమంగళా శాసనాలతో ఆలయంలో బ్రహ్మోత్సవాలను శ్రీమదుభయ వేదాన్తా చార్య పీఠం నిర్వహించనుంది.అందుకు పర్వతంపై ఉన్న పది ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పవిత్ర కృష్ణానది చెంతనే ఉన్న విజయకీలాద్రి పర్వతాన్ని తాకుతూ మూడువైపులా కృష్ణమ్మ నదీ జలాలు ప్రవహిస్తుంటాయి.
10 నుంచి విజయకీలాద్రిపై బ్రహ్మోత్సవాలు
శ్రీరంగంలాంటి దివ్యక్షేత్రంలో కావేరీ నది ఏవిధంగా మూడువైపులా ప్రవహిస్తుందో అదే తరహాలో విజయకీలాద్రికి మూడువైపులా కృష్ణానది ప్రవహిస్తుంది1965లో శ్రీపెద్ద జీయర్‌స్వామి ఇక్కడకు వచ్చిన సమయంలో విజయకీలాద్రి పర్వతం విశిష్టమైన పర్వతంగా రూపొందింది. కొండపై ఆలయాలను నిర్మించి 350 మెట్లు కలిగిన మార్గాన్ని ఏర్పరిచారు. నేడు దివ్యక్షేత్రంగా విజయకీలాద్రి విలసిల్లడానికి పెద్ద జీయర్‌స్వామి 56 ఏళ్ల క్రితం చేసిన మహా సంకల్పానికి సహకారమైంది. త్వరలో పర్వతంపై శ్రీభగవత్ రామానుజుల సహస్రాబ్ధి పురస్కరించుకుని 135 అడుగుల సమతామూర్తి విగ్రహ ఏర్పాటుకు కమిటీ సభ్యులు సంకల్పించారు10వ తేదీ భక్తులతో గిరి ప్రదక్షణ, ద్వజారోహణం ఉంటుంది. సాయంత్రం బేరీపూజ, శేషణవాహసేవ నిర్వహిస్తారు. 11న హంసవాహనసేవ, ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. 12న సూర్యప్రభ వాహనసేవ, ఆదిత్య హృదయ పారాయణం, రథసప్తమిసందర్బంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది.13న చంద్రప్రభ వాహనంపై స్వామివారి దర్శనం, 14న పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, మహాపూర్ణాహుతి, ద్వజారోహణం నిర్వహిస్తారు. 15న ఏకాంతసేవ, 16న భీష్మ ఏకాదశి సందర్బంగా శ్రీవిష్ణుసహస్రనామ జయంతి ఉంటుంది. శ్రీచిన్నజీయర్ స్వామి ప్రత్యక్షంగా సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో పాల్గొంటారు.
No comments:
Post a Comment