Breaking News

20/02/2019

ప్రత్యేక హోదా కోసం మోకాళ్ల పై నడిచిన న్యాయ వాది

నంద్యాల, ఫిబ్రవరి 20(way2newstv.in): 
నంద్యాల పట్టణంలో బుధవారం నాడు ప్రత్యేక హోదా ఆంథ్రుల హక్కు ,  ప్రథాన మంత్రి నరేంద్ర మోడీ మెండి నిద్ర వీడి వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ న్యాయవాది అనిల్ కుమార్ మోకాళ్ల పై నడుస్తూ చేపట్టిన పోరాట యాత్రను రాష్ట్ర విత్తనాభివ్వుద్ది సంస్థ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. పద్మావతి ఆర్చి ఎదురుగా ఉన్న తెలుగు దేశం పార్టీ కార్యాలయం నుంచి న్యాయ వాది అనిల్ కుమార్ నడుచు కుంటు టెక్కే రాజ్ దీయేటర్ టిటిడి రోడ్డు.


ప్రత్యేక హోదా కోసం మోకాళ్ల పై నడిచిన న్యాయ వాది

సంజీవనగర్ మీదుగా పొట్టి శ్రీరాముల విగ్రహం వరకు కొనసాగింది. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం అందజేశారు . అనంతరం అనిల్ కుమార్ మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంథ్రుల ఆకాంక్ష ను నెరవేర్చాలని కోరారు. ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ న్యాయ వాది అనిల్ కుమార్ ప్రత్యేక హోదా ఆంథ్రుల హక్కుఅని. మోది మొద్దు నిద్ర వీడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ బలమైన ఆశయంతో పోరాటాలకు సిద్ధం కావడం అభినందనీయమన్నారు. విద్యావంతుడే కాకుండా పీజీలో గోల్డ్ మెడల్ సాధించిన అనిల్ కుమార్ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై తన దైన శైలిలో పోరాడుతున్నారని. అతనికి మన మందరం అండగా ఉండీ మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment