Breaking News

12/02/2019

కేంద్రంపై న్యాయ పోరాటానికి సిద్ధం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10  (way2newstv.in
రాష్ట్రపతి రాజ్యంగపరమైన అధినేత అని, అంతిమంగా నిర్ణయాలు తీసుకోవాల్సింది కేంద్రమేనని పేర్కొన్నారు. తమకు న్యాయం జరగకుంటే కోర్టు తలుపులు తడతామని, అక్కడా న్యాయం జరగకపోతే ప్రజాక్షేత్రాన్ని ఆశ్రయిస్తామని వివరించారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అబద్ధాలతోనే బీజేపీ కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, వైసీపీలపై విరుచుకుపడ్డారు. తమ దీక్షకు వ్యతిరేకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగ లేఖ రాస్తే, దానికి వైసీపీ మద్దతిస్తోందని దుయ్యబట్టారు. 


కేంద్రంపై న్యాయ పోరాటానికి సిద్ధం

బీజేపీకి మద్దతుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, అందుకే రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని బాబు వ్యాఖ్యానించారు. అలాగే మోడీ గుంటూరుకు వస్తే ప్రోటోకాల్ పాటించడం లేదని వైసీపీ నేతలు విమర్శలు చేయడాన్ని సైతం ఆయన తప్పుబట్టారు. ప్రధాని గుంటూరుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్‌ వెళ్లిన విషయం గుర్తుచేసిన చంద్రబాబు, ఏపీ ప్రజలకు అన్యాయం చేసిన మోదీ వస్తే తాను వెళ్లాల్సిన అవసరం లేదని ఉద్ఘాటించారు. అంతేకాదు, జగన్ తాను చేసే పనులను ఇతరులు కూడు చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తారని, కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మూటలు ఇస్తాయని జగన్‌ విశ్వాసంతో ఉన్నారని ఆయన ఆరోపించారు. అనంతపురంలో జరిగిన శంఖారావం సభలో ఓటుకు బాబు రూ.5 వేలు ఇస్తాడని జగన్ చేసిన ఆరోపణలపై కూడా సీఎం స్పందించారు. తప్పుడు పనులు చేసే అలవాటు, చరిత్ర జగన్‌కు ఉందని, ఆ తరహా పద్దతులు, పనులు తనకు తెలియవని పేర్కొన్నారు. తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తే ఏమయ్యేదని, వైసీపీతో కలిసి రాజీనామాలు చేస్తే కుక్క తోక పట్టుకొని గోదారి దాటినట్టే ఉంటుందని ఎద్దేవా చేశారు. తాము రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి ఇచ్చిన విభజన హామీల అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించే వారే ఉండరని, టీడీపీ ఎప్పుడూ సామాజిక న్యాయాన్ని నమ్ముతోందని అన్నారు. తాను విద్యార్థి దశ నుంచి సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నాని, ఏపీలో ఒకే కులానికి పెద్ద పీట వేసినట్టు జగన్ తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ఒకే కులానికి పెద్ద పీట వేసినట్టు జగన్ నిరూపిస్తారా అని సవాల్ విసిరారు.హైదరాబాద్‌ అభివృద్ధికి 60 ఏళ్ల పాటు కృషి చేశామని, దానిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దామని వివరించారు. ప్రధాని మోదీలో నాయకత్వ లక్షణాలే లేవని, దేశాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనా ఆయనకు ఏ కోశానా లేదని ధ్వజమెత్తారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని చూసి ఎంతో మంది కలతచెందారని, ప్రత్యేక హోదా కోసం ఓ వికలాంగుడు అర్జున్‌రావు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పోరాటానికి కాంగ్రెస్‌ పూర్తి మద్దతు తెలిపిందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 11 జిల్లాల్లో ధర్మపోరాట దీక్షలు చేశామని, ఢిల్లీ దీక్షతో ఏపీ ప్రజల బాధను దేశం మొత్తానికి తెలియజేశామని అన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో నిరంతరం పోరాటం చేస్తున్నామని చంద్రబాబు గుర్తుచేశారు. 

No comments:

Post a Comment