Breaking News

07/02/2019

రామగుండం విద్యుత్ లో 85% వాటా తెలంగాణకే

  కేంద్ర కేబినెట్ ఆమోదం    
హైదరాబాదు, ఫిబ్రవరి 07 (way2nestv.in ) 
రాష్ట్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్ లో 85% తెలంగాణ వాడుకునేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న 4000 మెగావాట్ల ధర్మల్ విద్యుత్ కేంద్రం ఉత్పత్తి చేసే విద్యుత్ లో 85% వాటాను  వాడుకునేలా ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో  సమావేశమైన కేంద్ర మంత్రిమండలి  నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రానికి విద్యుత్ రంగంలో పెద్ద స్థాయిలో ఉపశమనం లభించినట్లయ్యింది. ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్తికరణ చట్టంలోని పదమూడవ షెడ్యూల్ ప్రకారం రామగుండం లో రూ.11,811.26 కోట్ల ఖర్చుతో 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ప్రకారం తొలి దశలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు యూనిట్లు, రెండవ దశలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లు 2020 డిసెంబర్ నాటికి వినియోగంలోకి రానున్నాయి. ప్రస్తుతం తొలి దశ పనులు జరుగుతున్నాయి గతేడాది మార్చి నాటికే సుమారు రూ.1849 కోట్ల ఖర్చు జరిగింది. 


 రామగుండం విద్యుత్ లో 85% వాటా తెలంగాణకే    

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తీవ్రమైన విద్యుత్ కొరత ఉన్న నేపథ్యంలో 4000 మెగావాట్ల  విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు 2016 జనవరి 29 న రూ. 11,811.26 కోట్లను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి దశ పనులు  ప్రస్తుతం జరుగుతున్న సమయంలో కేంద్రం మంత్రివర్గం 85% విద్యుత్ ను  తెలంగాణ రాష్ట్రమే వినియోగించుకునేలా ఆమోదం తెలపడం గమనార్హం. జార్ఖండ్ రాష్ట్రంలో 4000 మెగావాట్ల పట్ర్రాటు థర్మల్ విద్యుత్ కేంద్రానికి సైతం ఇదే తరహాలో 85% విద్యుత్ ను ఆ రాష్ట్రమే వినియోగించుకునేలా ఆమోదం తెలిపింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ రూపొందించిన ఈ ప్రతిపాదనలను లోతుగా చర్చించిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం విశేషం. త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందని, ఆ తర్వాత విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో 85% విద్యుత్ ను మనమే ఉపయోగించుకునేలా అనుమతి లభించడం ఆహ్వానించదగిన పరిణామం.

No comments:

Post a Comment