Breaking News

07/02/2019

ఆర్మూరులో రైతుల అందోళన

నిజామాబాద్, ఫిబ్రవరి 07 (way2newstv.in) 
నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తాలో ఉద్రిక్తత నెలకొంది. పసుపు,ఎర్ర జొన్న రైతాంగం అందోళనకు దిగింది.  గురువారం ఉదయం ధర్నాకు దిగడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.  పసుపు, ఎర్రజోన్నకు మద్దతు ధర ప్రకటించాలని, కొనుగోలు ప్రభుత్వం చేయాలని రైతులు  డిమాండ్ చేసారు. 


 ఆర్మూరులో రైతుల అందోళన

మామిడి పల్లి చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీకి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చెసారు. ఆర్మూరు,  బాల్కొండ నియోజకవర్గాల నుండి రైతులు పసుపు, ఎర్రజొన్నలను తరలించారు.  ముందస్తు జాగ్రత్తగా రైతులను ఆర్ముర్ రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. 

No comments:

Post a Comment