Breaking News

11/02/2019

బిసి కులస్తులకు 50వేల చెక్కులను పంపిణీ

కామారెడ్డి, ఫిబ్రవరి 11 (way2newstv.in)
కామారెడ్డి జిల్లా లోని ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో గల మైనారిటీ ఫంక్షన్ హాల్ లో ఈరోజు అర్హులైన బీసీ కులస్తులకు చెక్కులు పంపిణీ చేసిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజల  సురేందర్ మరియు బీసీ వెల్ఫేర్ అధికారి ఝాన్సీ. ఈ సందర్భముగా బీసీ వెల్ఫేర్ అధికారి ఝాన్సీ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన బీసీ కులస్తులకు వివిధ వృత్తి సంబంధిత ఉపాధి కల్పన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో 50 వేల రూపాయలు లబ్ధిదారులకు అందిస్తుందని సూచించారు. 


బిసి కులస్తులకు 50వేల చెక్కులను పంపిణీ 

ముఖ్యమంత్రి ఆదేశాలనుసారం బిసి కులస్తుల లో నిరుపేదలైన 274 మంది లబ్ధిదారులకు 50 వేలు ప్రభుత్వ సబ్సిడీ 60  శాతం నుండి 100 శాతం వరకు అందిస్తుందని అన్నారు.274 మంది లబ్ధిదారులకు ఎకనామిక్ సపోర్ట్ ద్వారా ఒక కోటి 37 లక్ష్యాలను ఖర్చు చేసిందన్నారు. అనంతరం శాసనసభ్యులు జాజాల సురేందర్ మాట్లాడుతూ కులవృత్తులను ఆదుకోవడానికి ఆర్థికపరంగా సబ్సిడీ ద్వారా ఉపాధి కల్పిస్తున్నాము అని అన్నారు.100% సబ్సిడీతో అందిస్తున్న 50 వేల చెక్కులతో లబ్ధిదారులు స్వయం ఉపాధి పొందాలన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంపత్ గౌడ్ , ఎంపీపీ నక్క గంగాధర్ , జెడ్ పి టి సి సామెల్ , లింగంపేట్ ఎంపీపీ ఆసియా బేగం , నాగ రెడ్డి పేట ఎంపీపీ ఉష ,  వైస్ ఎంపీపీ శ్రీనివాస్ , సతీష్ , పలు మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment